అక్షరటుడే, బోధన్: Bhubarathi | రైతుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి భూభారతి (Bhubarathi) పోర్టల్లో నమోదు చేయాలని సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub-Collector Vikas Mahato) అన్నారు. బోధన్ డివిజన్లో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులను మంగళవారం ఆయన పరిశీలించారు. మండలంలోని పెంటకలాన్(Pentakalan)తో పాటు కోటగిరి (Kotagiri) మండలంలోని గన్నారంలో రెవెన్యూ సదస్సులను ఆయన పరిశీలించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్లో అప్లోడ్ చేయాలని తహశీల్దార్లకు సూచించారు.
