అక్షరటుడే, ఇందూరు: BJP District President | స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల వివరాలను తెలియజేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (BJP district president Dinesh Kulachary) కోరారు.
ఈ మేరకు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి (Collector Vinay Krishna Reddy) గురువారం ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ.. 2011 జనాభా లెక్కల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు ఎంతశాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని అన్నారు.
అలాగే 2004లో రాష్ట్రవ్యాప్తంగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా బీసీ కులగణన చేశారని, నివేదిక ఆధారంగా బీసీలకు ఎన్నికల్లో ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారో చెప్పాలని కోరారు. రిజర్వేషన్ల కేటాయింపునకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందించిన వారిలో నాయకులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, యాదల నరేశ్, నారాయణ తదితరులున్నారు.