అక్షర టుడే, వెబ్ డెస్క్: Private Schools | జిల్లాలో అనుమతి పొందిన ప్రైవేట్ పాఠశాలల వివరాలు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిసేలా అన్ని ఎంఈఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలని ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం డీఈఓ కార్యాలయంలో జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్(District Education Officer Ashok)కు వినతి పత్రం అందజేశారు. జిల్లా కార్యదర్శి పెద్ది సూరి మాట్లాడుతూ.. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు మోసపూరిత ప్రకటనలతో విద్యార్థుల తల్లి మోసం చేస్తున్నాయన్నారు. దీంతో డీఈఓ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి మహేష్, జిల్లా సహా కార్యదర్శులు మారుతి, వేణు, యుఎస్ఎఫ్ఐ నగర నాయకులు బాబురావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
