అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | బాధితులకు సత్వర న్యాయం జరిగితేనే వ్యవస్థలపై విశ్వాసం పెరుగుతుందని ఎస్పీ రాజేష్ చంద్ర (SP rajesh chandra) అన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో స్టేషన్ రైటర్లు, డీఎస్పీ కార్యాలయ రైటర్లతో (station writers and DSP office writers) సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తు, విచారణ, పరిశోధనలో నాణ్యతే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
కేసుల పరిశోధనలో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని ఎస్పీ పేర్కొన్నారు. ముఖ్యంగా సీసీటీఎన్ఎస్ కేసులకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ (online update) అవుతుండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాక్షుల వాంగ్మూలం కేసులో ఎంతో ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.
తప్పుడు వాంగ్మూలాలు, నేరస్తునికి మేలు చేసే తప్పుడు స్టేట్మెంట్లు కేసుకు భంగం కలిగిస్తాయన్నారు. ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జీషీట్ వరకు అన్ని వివరాలు సమగ్రంగా, స్పష్టంగా నమోదు చేయాలని తప్పులు దొర్లకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ మురళి పాల్గొన్నారు.
