అక్షరటుడే, గాంధారి: Gandhari | ఓవైపు అకాల వర్షాలు.. మరోవైపు నకిలీ విత్తన మందులతో అన్నదాత అష్టకష్టాలు పడుతుంటే అడవి జంతువులు సైతం రైతులను ఇబ్బందులు పెడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండలం గుడిమెట్ (Gudimet) చెందిన రైతులు ఆర్ల నడిపోల్ల బలవంతరావు, ఉమ్మెడ బోజారావుకు చెందిన మొక్కజొన్న పంటను అడవి పందులు ధ్వంసం చేశాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
సుమారు ఐదు నుంచి ఆరెకరాల మొక్కజొన్న(Corn Croft) పంట పూర్తిగా ధ్వంసమైనట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ. 3 లక్షల వరకు నష్టం జరిగిందని రైతులు వాపోయారు. నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా నష్టపరిహారం అందేలా చూడాలని రైతులు విన్నవిస్తున్నారు.