అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం విషయంలో అనిశ్చిత పరిస్థితులున్నా దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market)వరుసగా రెండో రోజూ లాభాలతోనే ముగిసింది. బుధవారం ఉదయం సెన్సెక్స్(Sensex) 257 పాయింట్లు లాభంతో ప్రారంభమైంది. అక్కడినుంచి మరో 24 పాయింట్లు మాత్రమే పెరిగి నష్టాల బాట పట్టింది.
ఇంట్రాడే గరిష్టాలనుంచి 431 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 69 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా నిలదొక్కుకోలేకపోయింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి కొద్దిసేపటికే 121 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.30 గంటల వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడినా ఆ తర్వాత లాభాలబాట పట్టి రేంజ్ బౌండ్‌లో కొనసాగాయి. సెన్సెక్స్ 81,400 – 81,618 మధ్య, నిఫ్టీ(Nifty) 24,830 -24,902 పాయింట్ల మధ్య కదలాడాయి. చివరికి సెన్సెక్స్ 143 పాయింట్ల లాభంతో 81,481 వద్ద, నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 24,855 వద్ద స్థిరపడ్డాయి.
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,030 కంపెనీలు లాభపడగా 1,968 స్టాక్స్ నష్టపోయాయి. 160 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 144 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 66 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 9 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Market | మిక్స్‌డ్‌గా సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్‌లోని సూచీలు మిక్స్‌డ్‌గా సాగాయి. బీఎస్‌ఈలో ఇండస్ట్రియల్ ఇండెక్స్ 1.31 శాతం లాభపడగా.. ఇన్‌ఫ్రా(Infra) ఇండెక్స్ 0.36 శాతం, ఐటీ 0.31 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.28 శాతం, కమోడిటీ 0.26 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.27 శాతం లాభాలతో ముగిశాయి. రియాలిటీ ఇండెక్స్ 0.99 శాతం నష్టపోగా.. పీఎస్‌యూ బ్యాంక్(PSU Bank) ఇండెక్స్ 0.75 శాతం, ఆటో ఇండెక్స్ 0.64 శాతం, టెలికాం 0.42 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 0.26 శాతం నష్టపోయాయి. స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు 0.17 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.09 శాతం లాభాలతో ముగిశాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 15 కంపెనీలు లాభాలతో ఉండగా.. 15 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఎల్‌అండ్‌టీ 4.87 శాతం, సన్‌ఫార్మా 1.41 శాతం, ఎన్టీపీసీ 1.26 శాతం, మారుతి 1.19 శాతం, ఎయిర్‌టెల్ 0.87 శాతం లాభాలతో ముగిశాయి.
Top Losers : టాటా మోటార్స్ 3.47 శాతం, పవర్‌గ్రిడ్ 1.38 శాతం, ఎటర్నల్ 0.93 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.73 శాతం, హెచ్‌యూఎల్ 0.68 శాతం నష్టపోయాయి.