అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు మారడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు (ACB raids) చేస్తున్నా.. లంచం తీసుకోవడం ఆపడం లేదు. ఓ వైపు ఏసీబీ అధికారులు, ప్రభుత్వం అవినీతి నిర్మూలనపై అవగాహన కల్పిస్తుండగా.. మరోవైపు లంచాలు తీసుకుంటూ అధికారులు నిత్యం దొరుకుతున్నారు.
రంగారెడ్డి జిల్లా (Rangareddy district) పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహశీల్దార్ హనుమ రవీందర్ నాయక్ ఏసీబీ అధికారులకు దొరికాడు. ఓ వ్యక్తిపై నమోదైన పీడీఎస్ రైస్ కేసును (PDS rice case) తొలగించడానికి, అతనికి జరిమానా విధించి రేషన్ దుకాణాన్ని తెరుచుకోవడం కోసం సహాయం చేసేందుకు డిప్యూటీ తహశీల్దార్ లంచం డిమాండ్ చేశాడు. రూ.20 వేలు ఇవ్వాలని అడిగాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ACB Trap | లంచం అడిగితే ఫిర్యాదు చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.
ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.