అక్షరటుడే, గాంధారి: Gandivet village | గండివేట్ గ్రామ ఉప సర్పంచ్‌గా పెద్ద కాశీరాం, వార్డు మెంబర్లు (ward members) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి సంజీవ్ వారితో ప్రమాణం చేయించారు.
Gandivet village | ఫ్లెక్సీలో ఫొటోలు లేకపోవడంతో..
పంచాయతీ ఎన్నికలు (panchayat elections) ముగిసిన అనంతరం సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించింది. ఆ తేదీన గండివేట్ గ్రామ సర్పంచ్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కానీ ఆరోజు కాంగ్రెస్ మద్దతు దారుడైన సర్పంచ్, ఇద్దరు వార్డు సభ్యులతో కలిసి బాధ్యతలు తీసుకున్నారు. సర్పంచ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో బీఆర్ఎస్ మద్దతుదారులైన ఉపసర్పంచ్, వార్డు మెంబర్ల ఫొటోలు లేకపోవడంతో వారు కినుకు వహించినట్లు తెలిసింది. ఆ రోజు వారు ప్రమాణ స్వీకారం చేయలేదు. అనంతరం శుక్రవారం పంచాయతీ కార్యదర్శి సంజీవ్ సమక్షంలో వీరంతా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జడ్పీటీసీ తానాజీ రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శివాజీ, నాయకులు ఫరూక్, రెడ్డి రాజులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచును గజ మాలతో సత్కరించారు.