అక్షరటుడే, వెబ్డెస్క్: Pawan Kalyan | ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan)పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారని, ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు.
తూర్పు గోదావరి జిల్లా నిడవదోలు మండలం (Nidavadolu Mandal) పెరవలిలో అమరజీవి జలధార పథకానికి పవన్ శనివారం శంకుస్థాపన చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం 5 జిల్లాల్లో రూ.7,910 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో 1.20 కోట్ల మంది దాహర్తి తీర్చాలన్నదే లక్ష్యమని చెప్పారు. ఎక్కువ తీర ప్రాంతాలను కలిపే లక్ష్యంతో రూపకల్పన చేశామని పేర్కొన్నారు. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నదే తమ లక్ష్యం అన్నారు.
Pawan Kalyan | యోగీ ట్రీట్మెంట్ ఇవ్వాలి
బెదిరించే రౌడీలకు యోగీ ట్రీట్మెంట్ (Yogi Treatment) ఇస్తేనే సెట్ అవుతారని పవన్ కల్యాణ్ అన్నారు. కాలుకి కాలు, కీలుకి కీలు తీస్తే అప్పుడు దారికొస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజులు శ్రద్ధ పెట్టి ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే ఇంకోసారి బెదిరింపు వ్యాఖ్యలు రౌడీల నోటి నుంచి రావన్నారు. విదేశాల్లో ఉండి వాగేవారిని.. ఇక్కడ ఉండి మేమొస్తే.. అంటున్న వాళ్లను ఏం చేయాలని ప్రశ్నించారు.
Pawan Kalyan | వారి తాటా తీస్తా
ఒక ఆశయం కోసం తన ప్రాణం పోయినా పర్వాలేదు అని పవన్ కల్యాణ్ అన్నారు. కానీ పోయే ముందు చాలా మంది తాట తీసే పోతానని చెప్పారు. వైసీపీ (YCP)లో కొందరు నేతలంటే తనకు గౌరవం ఉందన్నారు. కానీ కొందరు మళ్లీ పాత పద్దతుల్లోకి వెళ్తున్నారని,అలంటి వాళ్ల తాట తీసి కూర్చోబెడతానని హెచ్చరించారు.