ePaper
More
    HomeతెలంగాణDeputy CM Bhatti | తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌కి గుడ్ న్యూస్ చెప్పిన భ‌ట్టి.. ఆనందంలో...

    Deputy CM Bhatti | తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌కి గుడ్ న్యూస్ చెప్పిన భ‌ట్టి.. ఆనందంలో ప్ర‌ముఖులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Deputy CiM Bhatti | గద్దర్ అవార్డుల (Gaddar Awards) ప్రదానోత్సవం హైదరాబాద్(Hyderabad)లోని హైటెక్స్ లో అట్ట‌హాసంగా జ‌రిగింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలుగు చిత్రపరిశ్రమలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు.

    కాగా, ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌రాజు (Producer Dilraju), ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్‌, అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, నాగ్ అశ్విన్, మణిరత్నం హాజరయ్యారు. పుష్ప 2 సినిమాలో (Pushpa 2 Movie) నటన కుగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు గద్దర్ అవార్డ్ అందజేసింది తెలంగాణ ప్రభుత్వం.

    Deputy CiM Bhatti | గుడ్ న్యూస్..

    అయితే తెలంగాణ సంస్కృతి, ఉద్యమ చైతన్యానికి ప్రతీక అయిన ప్రజాకళాకారుడు గద్దర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సినీ అవార్డులు – 2024 (Telangana Gaddar Cine Awards – 2024) అందించడం గర్వకారణం అని భ‌ట్టి చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక హక్కుల కోసం గళం విప్పి, గజ్జలు మ్రోగించి, పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపిన గద్దర్ గారి జీవిత మార్గదర్శనమే ఈ అవార్డుల ప్రేరణ. 2011లో ఆగిపోయిన రాష్ట్ర సినీ అవార్డుల (state film awards) పునఃప్రారంభానికి మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2014 నుంచి 2023 వరకు ఉత్తమ సినిమాలు, దర్శకులు, నటీనటులకు పురస్కారాలు అందించారు.

    ఇక తమ ప్రభుత్వం తెలంగాణను సినిమా రాజధానిగా అభివృద్ధి చేయాలన్న దిశగా ముందుకెళ్తోంది. సినిమా షూటింగ్‌ అనుమతులకు సింగిల్ విండో, టూరిజం లొకేషన్లలో షూటింగ్‌కు అవసరమైన సహాయం, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, కార్మిక సంక్షేమం వంటి అంశాల్లో అవసరమైన చర్యలు తీసుకుంటామని భట్టి ప్రకటించారు. రేవంత్ రెడ్డి (Revanth reddy) గారి నాయకత్వంలో హైదరాబాద్‌ను గ్లోబల్ సినిమా హబ్‌గా తీర్చిదిద్దే కార్యక్రమానికి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించామని చెప్పారు. “తెలంగాణ గర్వించదగిన కళాకారుడు గద్దర్ పేరుతో ఈ పురస్కారాలను అందించడమన్నది సినిమా పరిశ్రమకు ఇచ్చే గౌరవానికి నిదర్శనం. తెలంగాణ గద్దర్ సినీ అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా ప్రత్యేక శుభాకాంక్షలు” అని ఆయన పేర్కొన్నారు.

    Latest articles

    Vice President election | ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్​ విడుదల.. పోలింగ్​ ఎప్పుడంటే..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice President election : భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కీలక అప్​డేట్​ చోటుచేసుకుంది....

    Heavy Rains | దంచికొట్టిన వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

    అక్షరటుడే, ఇందూరు: Heavy Rains : ఉభయ కామారెడ్డి, నిజామాబాద్​ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. గురువారం తెల్లవారుజాము...

    Gold Price | పైపైకి పోతున్న బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు కొనేవారు ఏం చేయాలంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price : భారతదేశంలో బంగారం Gold మరియు వెండి ధరలు రోజువారీగా మారుతూ ఉండటం...

    Gifty nifty | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gifty nifty | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. బుధవారం యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు...

    More like this