అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా(H1B Visa) దరఖాస్తు ఫీజును భారీగా పెంచిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు.
ప్రధాని శనివారం గుజరాత్(Gujarat)లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మనకు ప్రధాన శత్రువులు ఎవరు లేరని ఆయన పేర్కొన్నారు. కానీ ఇతర దేశాలపై ఆధారపడటమే మన ప్రధాన శత్రువు అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్ ‘‘విశ్వబంధు’’(Vishwabandhu) స్ఫూర్తితో సాగుతోందన్నారు. ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని ఆయన సూచించారు. విదేశాలపై ఆధారపడటం ఎక్కువైతే అభివృద్ధి నిలిచిపోతుందన్నారు.
PM Modi | ఆత్మనిర్భర్‌గా మారాలి
అత్యధిక జనాభా కలిగిన భారత్ ఆత్మనిర్భర్‌గా మారాలని మోదీ(PM Modi) ఆకాంక్షించారు. ఇతర దేశాలపై ఆధారపడితే ఆత్మగౌరవం దెబ్బతింటుందన్నారు. దేశంలో సామర్థ్యానికి ఎప్పుడు కొరత లేదని ఆయన అన్నారు. అయితే కాంగ్రెస్ దేశ సామర్థ్యాన్ని విస్మరించిందని విమర్శించారు. గతంలో దేశంలో తయారు చేసిన నౌకలను మనం వినియోగించేవారమని ఆయన గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చాక ఆ రంగం పూర్తిగా నాశనమైందని ఆరోపించారు. దీంతో ప్రస్తుతం మనం 90శాతం విదేశీ నౌకలపై ఆధారపడుతున్నామని చెప్పారు. దీని కోసం సంవత్సారికి రూ.6 లక్షల కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు.
PM Modi | కుంభకోణాలకు పాల్పడింది
స్వాతంత్య్రం వచ్చి ఇన్ని రోజులైన భారత్ అభివృద్ధి చెందకపోవడానికి గల కారణాలను మోదీ వివరించారు. కొన్నేళ్ల పాటు కాంగ్రెస్ దేశాన్ని లైసెన్స్ రాజ్‌లో బంధించి, ప్రపంచ మార్కెట్ల నుంచి ఒంటరిగా ఉంచిందన్నారు. అనంతరం గ్లోబలైజేషన్(Globalization) మొదలైనప్పుడు కూడా కాంగ్రెస్ పాలకులు దిగుమతులపై ఆధారపడ్డారన్నారు. అప్పుడు రూ.వేల కోట్ల కుంభకోణాలు చేసి దేశ అభివృద్ధిని గాలికి వదిలేశారని మోదీ ఆరోపించారు.