అక్షరటుడే, బాన్సువాడ: Sri chaitanya School | పట్టణంలోని వీక్లీ మార్కెట్(Weekly market) వద్ద శ్రీచైతన్య స్కూల్‌ను అనుమతులు లేకుండానే ప్రారంభించారు. నర్సరీ నుంచి 7వ తరగతి వరకు క్లాసుల నిర్వహణకు అనుమతి కోరుతూ చేసిన ప్రతిపాదనను జిల్లా విద్యాధికారి అధికారి రాజు (DEO Raju) తిరస్కరించారు.
హైకోర్టు (High court) ఆదేశాల మేరకు పాఠశాల ప్రతినిధులు చేసిన అభ్యర్థనను పునఃసమీక్షించిన అనంతరం డీఈవో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2025–26కు గాను అనుమతుల కోసం గడువు ముగిసిన తర్వాత దరఖాస్తు చేశారని, 2022లో ఫారం–A ఆధారంగా 2025–26కి అనుమతి చట్టపరంగా సాధ్యం కాదన్నారు. దరఖాస్తులో సమర్పించాల్సిన పలు డాక్యుమెంట్లు జత చేయని కారణంగా అనుమతి ఇవ్వడం లేదని ప్రొసీడింగ్ జారీ చేశారు.
Sri chaitanya School | నిర్మాణ దశలోనే పాఠశాల భవన నిర్మాణం..
పాఠశాల భవనం నిర్మాణ దశలో ఉందని, తరగతులు నిర్వహించడానికి అనుకూలంగా లేదన్నారు. 2022 అక్టోబర్‌లో చెల్లించిన చలాన్‌కు గడువు ముగిసిపోయిందన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని స్కూల్‌కు 2025–26 విద్యా సంవత్సరానికి గుర్తింపు ఇవ్వలేమని చెప్పారు. తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, గుర్తింపు పొందిన పాఠశాలలోనే చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.