అక్షరటుడే, వెబ్డెస్క్: Dengue | ఉమ్మడి జిల్లాలో డెంగీ విస్తరిస్తోంది. దవాఖానాల్లో రోగుల(patients) సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రధానంగా డెంగీ కేసులే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏడిస్ దోమల (Mosquitoes) వ్యాప్తి చెందే డెంగీ ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ గా (viral infection) మొదలై రక్తస్రవాం, ప్లేట్‌లెట్స్ తగ్గడం, ప్లాస్మా లీకేజ్ (plasma leakage) వంటి వాటికి దారి తీస్తాయి. అయితే, ముందుగానే డెంగీ లక్షణాలను (dengue symptoms) గుర్తించి చికిత్స తీసుకుంటే సులువుగా బయటపడొచ్చని వైద్యుల సూచిస్తున్నారు.
Dengue | డెంగీ లక్షణాలు..
డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ (డీఎహెచ్ఎఫ్) (dengue hemorrhagic fever) ప్రారంభ లక్షణాలు సాధారణ జ్వరం మాదిరిగానే ఉంటాయి. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, దద్దుర్లు వంటివి వస్తాయి. అదే సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి, పదేపదే వాంతులు, చిగుళ్లు లేదా ముక్కు నుండి రక్తస్రావం, రక్తంతో వాంతులు (blood vomtings) చేసుకోవడం, రక్తపోటులో అకస్మాత్తుగా తగ్గుదల వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. వేరే వైరస్ జాతి కారణంగా గతంలో డెంగీ ఇన్ఫెక్షన్ (Dengue infection) ఉన్న వ్యక్తులలో డీహెచ్ఎఫ్ చాలా తరచుగా సంభవిస్తుంది. రెండోసారి డెంగీ సోకినప్పుడు రోగనిరోధక శక్తిని తగ్గించి, ప్రమాద తీవ్రను పెంచుతుంది.
Dengue | నివారణ..
డీహెచ్ఎఫ్ కి యాంటీవైరల్ చికిత్స (antiviral treatment) లేదు. చికిత్సలో జాగ్రత్తగా ద్రవ మార్పిడి, కీలక సంకేతాలను నిశితంగా పర్యవేక్షించడం, అవయవ వైఫల్యాన్ని నివారించడానికి సహాయక చికిత్స ఉంటాయి. అయితే, దోమలను (Mosquitoes) నియంత్రించడం ద్వారా డెంగీ వ్యాప్తిని నివారించవచ్చు. గుంతల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడడం ద్వారా దోమలను నియంత్రించవచ్చు. అలాగే, దోమల నుంచి రక్షించుకోవడానికి శరీరం నిండుగా దుస్తులు ధరించాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్తను పాడేయకుండా డస్ట్‌బిన్‌లలో మాత్రమే వేయాలి. ప్రధానంగా దోమలను నియంత్రించడం ద్వారా డెంగీ సోకకుండా చూసుకోవచ్చు.