Homeజిల్లాలునిజామాబాద్​Dengue Fever | రాజీవ్​నగర్​ తండాలో డెంగీ కలకలం.. రక్తనమూనాలు సేకరించిన వైద్యశాఖ

Dengue Fever | రాజీవ్​నగర్​ తండాలో డెంగీ కలకలం.. రక్తనమూనాలు సేకరించిన వైద్యశాఖ

- Advertisement -

అక్షరటుడే, బోధన్: Dengue Fever | మండలంలోని రాజీవ్​నగర్​ తండాలో (Rajiv Nagar Thanda) డెంగీ కలకలం సృష్టించింది. తండాలో ఓ వ్యక్తికి డెంగీ సోకగా.. వెంటనే అతడిని నిజామాబాద్​ జీజీహెచ్​కు (Nizamabad GGH) చికిత్స నిమిత్తం తరలించారు.

Dengue Fever | తండా మొత్తం మంచం పట్టింది..

రాజీవ్ నగర్ తండాలో చాలామంది జ్వరాలబారిన పడ్డారు. దీంతో వైద్యసిబ్బంది అలర్ట్​ అయ్యారు. తండాలో వెంటనే వైద్యశిబిరం ఏర్పాటుచేసి సుమారు 50 మంది నుంచి రక్తనమూనాలు సేకరించారు. వాటిని పరీక్షల నిమిత్తం పంపారు. అనంతరం తండాలోని కాలనీల్లో పరిశుభ్రతపై ఎంపీడీవో బాలగంగాధర్​ , మెడికల్​ ఆఫీసర్​ జుబేరియా (MPDO Bala Gangadhar) ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఇంటింటికీ తిరుగుతూ దోమల మందు పిచికారీ చేయించారు.

తండాలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో రోగికి చికిత్స చేస్తున్న మెడికల్​ ఆఫీసర్​ జుబేరియా

Must Read
Related News