ePaper
More
    HomeజాతీయంRailway Passengers | కాచిగూడ​ నుంచి కరీంనగర్​ డెమూను పెద్దపల్లి వరకు నడపాలి

    Railway Passengers | కాచిగూడ​ నుంచి కరీంనగర్​ డెమూను పెద్దపల్లి వరకు నడపాలి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Railway Passengers | కాచిగూడ నుంచి ప్రస్తుతం కరీంనగర్​ వరకు డెమూ రైలు(Demo Train) నడుస్తోంది. అయితే దీనిని పెద్దపల్లి వరకు నడపాలనే డిమాండ్​ ఉంది. సమయంతో పాటు దూరం తగ్గుతుంది. దీంతో నిజామాబాద్​, ఆర్మూర్​, జగిత్యాల, కరీంనగర్​ తదితర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఢిల్లీ, వైజాగ్​, కాశీ, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది.

    Railway Passengers | పెద్దపల్లి మీదుగా అనేక రైళ్లు

    పెద్దపల్లి(Peddapalli) మీదుగా వివిధ నగరాలు, ప్రముఖ క్షేత్రాలకు అనేక రైళ్లు నడుస్తున్నాయి. కాచిగూడ–కరీంనగర్​ డెమూ రైలు(Kacheguda-Karimnagar Demo Train)ను పెద్దపల్లి వరకు పొడిగిస్తే అక్కడి నుంచి వెళ్లడానికి ప్రయాణికులకు అనువుగా ఉంటుంది. న్యూఢిల్లీ – వైజాగ్​ ఏపీ ఎక్స్​ప్రెస్​​, అహ్మదాబాద్​ టు చెన్నై నవజీవన్​ ఎక్సెప్రెస్​ పెద్దపెల్లి మీదుగా వెళ్తుంటాయి. అలాగే మాతా వైష్ణోదేవి కాట్రా టు చెన్నై సెంట్రల్​ వారంలో మూడు రోజులు, మరో రెండు రోజులు లక్నో టు చెన్నై రాకపోకలు సాగుతుంటాయి. డెమూ పొడిగిస్తే నిజామాబాద్​, ఆర్మూర్​, జగిత్యాల, కరీంనగర్​ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే వారికి సౌకర్యవంతంగా ఉటుంది. అలాగే రైలులో ఆక్యుపెన్సీ సైతం పెరుగుతుంది. అంతేకాకుండా పెద్దపల్లి నుంచి సాయంత్రం ఆరు గంటల సమయంలో చెన్నై టు ఢిల్లీ మీదుగా వైష్ణోదేవి వెళ్లే రైలు ఉంటుంది. దీనిని త్వరలో శ్రీనగర్​ వరకు పొడిగించే అవకాశం ఉంది. ఇది ప్రయాణికులకు(Railway Passengers) ఉపయోగపడుతుంది. అంతేకాకుండా భద్రాచలం వెళ్లే వారికి పెద్దపల్లి నుంచి కొత్తగూడెం వెళ్లే సింగరేణి ప్యాసింజర్​ (పుష్​పుల్​) ఉంటుంది.

    READ ALSO  Bodhan | వర్షం ఎఫెక్ట్​.. నిండిన షర్బత్​ కెనాల్​.. మరమ్మతులు చేపట్టిన అధికారులు

    Railway Passengers | బోధన్​– సిర్పూర్​ పుష్​పుల్ టైమింగ్​ మార్చాలి

    బోధన్​ – కరీంనగర్​ – సిర్పూర్​ మధ్య నిత్యం ​పుష్​పుల్ రైలు(Push Pull Train) రాకపోకలు సాగితోంది. అయితే ఈ రైలు ఉదయం 4 గంటలకు బోధన్(Bodhan)​ నుంచి బయలు దేరుతోంది. అంత పొద్దున ఉండటంతో ప్రయాణికులు ఎక్కడానికి ఆసక్తి చూపడం లేదు. దీని సమయాన్ని మార్చాలని కోరుతున్నారు. దీనిని అజంతా ఎక్స్​ప్రెస్​ సమయానికి ఆరు గంటలకు లింక్​ చేసి నడిపిస్తే జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్​, పెద్దపల్లి, మంచిర్యాల ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. షిరిడీ, ఔరంగాబాద్​ వెళ్లే ప్రయాణికులు ఉదయం దిగి వెళ్లవచ్చు. అలాగే 12 గంటల సమయంలో కాశీకి సికింద్రాబాద్​ – దానాపూర్​ ఎక్సెప్రెస్​ వయా వారణాసి వెళ్తుంది. దీంతో నిజామాబాద్​ ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గుతాయి.

    READ ALSO  Mansa Devi temple | హరిద్వార్‌ మానసదేవి ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి

    Latest articles

    Railway Line | ఉత్తరాదికి మరింత వేగంగా రైళ్లు.. కాజీపేట–బల్లార్షా మార్గంలో త్వరలో నాలుగో రైల్వే లైన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Line | తెలంగాణ నుంచి ఇక ఉత్తరాది రైళ్లు మరింత వేగంగా దూసుకు...

    Bodhan | హాస్టళ్లలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి.. లేదంటే చర్యలు తప్పవు: బోధన్​ మున్సిపల్ కమిషనర్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan | ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ....

    Weather Updates | రాష్ట్రానికి నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం తేలికపాటి వర్షాలు (Scattered Rains)...

    Meenakshi Natarajan padayatra | మీనాక్షి నటరాజన్ పాదయాత్ర.. బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు

    అక్షరటుడే, ఆర్మూర్: తెలంగాణ కాంగ్రెస్ ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్​...

    More like this

    Railway Line | ఉత్తరాదికి మరింత వేగంగా రైళ్లు.. కాజీపేట–బల్లార్షా మార్గంలో త్వరలో నాలుగో రైల్వే లైన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Line | తెలంగాణ నుంచి ఇక ఉత్తరాది రైళ్లు మరింత వేగంగా దూసుకు...

    Bodhan | హాస్టళ్లలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి.. లేదంటే చర్యలు తప్పవు: బోధన్​ మున్సిపల్ కమిషనర్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan | ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ....

    Weather Updates | రాష్ట్రానికి నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం తేలికపాటి వర్షాలు (Scattered Rains)...