Demolition of illegal constructions
Illegal constructions | 2,500 అక్రమ నిర్మాణాల కూల్చివేత.. ఎక్కడో తెలుసా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Illegal constructions | ఒకేసారి 2,500 అక్రమ నిర్మాణాలను Illegal constructions అధికారులు కూల్చివేస్తున్నారు. గుజరాత్​ Gujaratలో అక్రమ నిర్మాణాల తొలగింపులో భాగంగా మంగళవారం ఉదయం చందోలా chandola లేక్​ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూల్చివేతలు చేపట్టారు. అక్రమంగా నిర్మించిన 2,500 కు పైగా ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. వీటిలో ఎక్కువ భాగం బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా నివస్తున్న వారివి కావడం గమనార్హం.

illegal constructions | 8 వేల మంది పోలీసుల బందోబస్తు

అహ్మదాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ Ahmedabad Municipal Corporation అధికారులు తొలిదశలో భాగంగా ఏప్రిల్​ 29, 30 తేదీల్లో మూడు వేల అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. తాజాగా మంగళవారం 35 హిటాచీలు, 15 జేసీబీల సాయంతో 2,500 అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 8 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. చొరబాటుదారుల ఆక్రమణల నుంచి 2.5 లక్షల చదరపు మీటర్లను స్వాధీనం చేసుకోనున్నారు.