అక్షరటుడే, గాంధారి: Gandhari | నకిలీ జొన్న విత్తన విక్రేతలపై (fake sorghum seeds) తగుచర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో తహశీల్దార్ రేణుక చావన్కు (Tahsildar Renuka Chavan) వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ్ జిల్లా కార్యదర్శి ఆర్ల శంకర్ రావు మాట్లాడుతూ మూడునెలల క్రితం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం పంటను కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయలేదన్నారు. వెంటనే కొనుగోలు చేసిన మొక్కజొన్నకు సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
Gandhari | నకిలీ విత్తనాలతో కుదేలు..
ఓ ప్రైవేట్ కంపెనీ జొన్నవిత్తనాల (sorghum seeds) కారణంగా రైతులు భారీగా నష్టపోయారని రైతులు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. కంకుల్లో విత్తులు రాక రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారని పేర్కొన్నారు. నకిలీ విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులను సదరు కంపెనీ, ప్రభుత్వంం నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
రైతు సమస్యలను గాలికొదిలేసి..
ప్రభుత్వం రైతు సమస్యలను నిమ్మకు నీరెత్తినట్లు చూస్తోందని రైతులు విమర్శించారు. వెంటనే రైతు సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో రైతులు రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ మండల అధ్యక్షుడు మాధవరావు రైతులు తదితరులు పాల్గొన్నారు.