Bheemgal Mandal
Bheemgal Mandal | అంబులెన్స్​లో ప్రసవం

అక్షరటుడే, భీమ్​గల్​ : Bheemgal mandal | భీమ్​గల్​ మండలం రహత్ నగర్ గ్రామానికి (Rahat Nagar village) చెందిన సిరికొండ శిరీష 108 అంబులెన్స్​లో ప్రసవించింది.

అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ అంబాదాసు, పైలట్ రాజన్న తెలిపిన వివరాల ప్రకారం.. శిరీషకు పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు 108కు ఫోన్​ చేశారు. అంబులెన్స్​లో భీమ్​గల్​ పీహెచ్​సీకి (Bheemgal PHC) తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆర్మూర్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలో నొప్పులు ఎక్కువ అవ్వడంతో అంబులెన్స్​లోనే ప్రసవించింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు ఈఎంటీ తెలిపారు.