ePaper
More
    Homeలైఫ్​స్టైల్​Mutton Kadai Curry | రుచికరమైన మటన్ కడై కర్రీ.. ఇలా చేస్తే ముద్ద వదలరు!

    Mutton Kadai Curry | రుచికరమైన మటన్ కడై కర్రీ.. ఇలా చేస్తే ముద్ద వదలరు!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mutton Kadai Curry | సాధారణంగా మటన్ కూర అంటేనే చాలామందికి ఇష్టం. అయితే, ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మటన్ కడై కర్రీని(Mutton Kadai Curry) ఒక్కసారి రుచి చూశారంటే దాని రుచిని మర్చిపోలేరు. దీనిని ఇంట్లోనే సులభంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

    Mutton Kadai Curry | కావలసిన పదార్థాలు:

    • మటన్: 600 గ్రాములు (ఎముకలు లేనిది)
    • ఉల్లిపాయలు: 2
    • టమోటాలు: 400 గ్రాములు
    • నూనె లేదా నెయ్యి: 4 టేబుల్ స్పూన్లు
    • పెరుగు: 1 కప్పు
    • పచ్చిమిర్చి: 2
    • అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 స్పూన్
    • పసుపు: చిటికెడు
    • ఉప్పు: తగినంత
    • గరం మసాలా: 1.5 స్పూన్లు
    • కసూరి మేథి: 1 స్పూన్
    • కొత్తిమీర తరుగు: 1 టేబుల్ స్పూన్

    Mutton Kadai Curry | మసాలా దినుసులు (వేయించి పొడి చేయాలి):

    1. కాశ్మీరీ మిరపకాయలు: 3
    2. పచ్చి ఏలకులు: 4
    3. నల్ల ఏలకులు: 4
    4. లవంగాలు: 4
    5. దాల్చిన చెక్క: 2
    6. జీలకర్ర: 1 టేబుల్ స్పూన్
    7. సోంపు: 1 టీ స్పూన్
    8. నల్ల మిరియాలు: 1 టీ స్పూన్

    Mutton Kadai Curry | తయారీ విధానం:

    మసాలా పొడి తయారీ: ముందుగా స్టవ్‌పై కడాయి పెట్టి తక్కువ మంట మీద కాశ్మీరీ మిరపకాయలు, జీలకర్ర, సోంపు, నల్ల మిరియాలు, లవంగాలు, నల్ల, పచ్చి ఏలకులు, దాల్చిన చెక్క వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. వీటిని చల్లార్చి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.

    మటన్ వేయించడం: అదే కడాయిలో నూనె లేదా నెయ్యి వేసి వేడి అయ్యాక నల్ల ఏలకులు, తరిగిన ఉల్లిపాయలు (Onions) వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు మటన్ ముక్కలు వేసి రంగు మారే వరకు 5-6 నిమిషాలు వేయించాలి.

    మసాలా కలపడం: అల్లం వెల్లుల్లి పేస్ట్ (ginger garlic paste) వేసి 2 నిమిషాలు వేయించిన తర్వాత పసుపు, ఉప్పు, మరియు ముందుగా తయారుచేసుకున్న మసాలా పొడిలో సగం వేసి బాగా కలపాలి. 3/4 కప్పు వేడి నీళ్ళు పోసి మీడియం మంట మీద మూత పెట్టి సుమారు గంటసేపు ఉడికించాలి. మధ్యలో అవసరాన్ని బట్టి వేడి నీళ్ళు కలుపుతూ ఉండాలి.

    టమోటా, పెరుగుతో ఉడికించడం: గంట తర్వాత మటన్ (Mutton) ఉడికి నీరంతా ఇంకిపోయి చిక్కని గ్రేవీలా మారుతుంది. అప్పుడు టమోటాలను పేస్ట్ చేసి అందులో వేసి మరో 30 నిమిషాలు ఉడికించాలి. తర్వాత పెరుగు వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.

    చివరి మెరుగులు: మిగిలిన మసాలా పొడి, గరం మసాలా వేసి 5 నిమిషాలు ఉడికించి, చివరగా కసూరి మేథి, తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన మటన్ కడై(Mutton Kadai Curry) కర్రీ సిద్ధం.

    ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రుచికరమైన మటన్ కర్రీని (Muttun Curry) మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి.

    More like this

    Vote Chori | ఓటు చోరుల‌ను కాపాడుతున్న ఈసీ.. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోప‌ణ‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vote Chori | కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission)పై కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి...

    BC Declaration | బీసీ రిజర్వేషన్లు అమలయ్యాకే స్థానిక ఎన్నికలకు వెళ్తాం: పీసీసీ చీఫ్​

    అక్షరటుడే, కామారెడ్డి: BC Declaration | బీసీ రిజర్వేషన్లు అమలయ్యాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని పీసీసీ చీఫ్​ బొమ్మ...

    IRCTC | శివ‌భ‌క్తులకు రైల్వే గుడ్‌న్యూస్‌.. జ్యోతిర్లింగాల ద‌ర్శ‌నం ప్యాకేజీ ప్ర‌క‌ట‌న‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IRCTC | శివ భ‌క్తుల కోసం భారతీయ రైల్వే (Indian Railways) ఒక ప్రత్యేక...