అక్షరటుడే, వెబ్‌డెస్క్ : WPL 2026 | డబ్ల్యూపీఎల్ WPL 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్రకు ఢిల్లీ క్యాపిటల్స్ అడ్డుకట్ట వేసింది. వరుసగా ఐదు విజయాలతో దూసుకెళ్లిన ఆర్సీబీకి ఆరో మ్యాచ్‌లో ఊహించని షాక్ తగిలింది.
వడోదర వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ సమష్టి ప్రదర్శనతో 7 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో ఆర్సీబీ పూర్తిగా విఫలమవడం ఈ పరాజయానికి ప్రధాన కారణంగా మారింది. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ స్మృతి మంధాన ఒంటరిగా పోరాడుతూ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినా, మిగతా బ్యాటర్లు నిలకడ చూపలేకపోయారు. ఢిల్లీ బౌలర్లు ఆర్సీబీ RCB బ్యాటింగ్‌ను చిత్తుచేసి మ్యాచ్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
WPL 2026 | ఆర్సీబీ టాప్‌లో..
నందని శర్మ NAdini Sharma మూడు కీలక వికెట్లు తీయగా, మరిజన్నే కాప్, హెన్రీ, మిన్ను మని వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. దీంతో ఆర్సీబీ పెద్ద స్కోర్ చేసే అవకాశాన్ని కోల్పోయింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఆడింది. లారా వోల్వార్డ్ట్ కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ముందుకు నడిపించగా, మరిజన్నే కాప్ మరోసారి ఆల్‌రౌండ్ ప్రతిభ చూపిస్తూ విజయాన్ని ఖాయం చేసింది. కేవలం 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమితో ఆర్సీబీ నేరుగా ఫైనల్ చేరే అవకాశాలు కొంత సంక్లిష్టంగా మారాయి. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో ఇప్పటికీ ఆర్సీబీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంకా ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్‌తో రెండు కీలక మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
ఈ రెండింటిలో కనీసం ఒక మ్యాచ్ గెలిస్తే నేరుగా ఫైనల్ బెర్త్ ఖాయం కానుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌ల్లో ఓడినా, మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆర్సీబీకి ఇప్పటికీ ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఇతర జట్లు అయిన ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ తమ మిగిలిన మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించి రన్‌రేట్ మెరుగుపర్చాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం రన్‌రేట్ పరంగా ఆర్సీబీ ముందంజలో ఉండటం స్మృతి మంధాన Smriti Mandhana సేనకు కలిసొచ్చే అంశంగా మారింది. ఒక మ్యాచ్‌లో తడబడినా, మొత్తం టోర్నీలో ఆర్సీబీ స్థిరత్వం ఇప్పటికీ ఫైనల్ రేస్‌లో వారికి బలమైన ఆధిక్యతనిచ్చేలా కనిపిస్తోంది.