ePaper
More
    HomeFeaturesThar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) నగరంలో ఓ యువతి చేసిన డ్రైవింగ్ తప్పిదంతో ఆమె కొన్న రూ. 27 లక్షల విలువైన కొత్త కారు మొదటి అంతస్తు నుంచి పడిపోయింది.

    ఘజియాబాద్‌కు చెందిన మాని పవార్‌ అనే మహిళ రూ.27 లక్షల విలువ చేసే థార్​ ఎస్​యూవీని కొనుగోలు చేసింది. దానిని తీసుకోవడానికి సోమవారం తూర్పు ఢిల్లీ (Delhi)లోని ప్రీత్ విహార్‌లోని మహీంద్రా షోరూమ్ (Mahindra Showroom)​కు ఆమె కుటుంబంతో కలిసి వెళ్లింది. కారు డెలివరీ తీసుకున్న తర్వాత.. మంచికి సూచకంగా నిమ్మకాయ మీదుగా కారు నడిపించాలని ఆమె భావించింది. అయితే ఈ చిన్న ఆచారం పెద్ద ప్రమాదానికి దారితీసింది.

    Thar SUV | ప్ర‌మాదం ఎలా జ‌రిగిందంటే..

    కారు (Car) స్టార్ట్ చేసిన మానీ, అనుకోకుండా యాక్సిలేటర్‌ను బలంగా తొక్కడంతో కారు ఒక్కసారిగా వేగంగా ముందుకు దూసుకెళ్లింది. షోరూం ఫస్ట్ ఫ్లోర్‌లోంచి గ్లాస్‌ను ధ్వంసం చేస్తూ కిందకు పడిపోయింది. ఆ సమయంలో కారులో మానీ పవార్‌తో పాటు షోరూం ఉద్యోగి వికాస్ కూడా ఉన్నారు. కారుతో పాటు వారు కూడా కింద పడిపోవడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. అయితే, ఎయిర్‌బ్యాగ్స్ (Air Bags) తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు పోలీసులు తెలిపారు. షోరూం సిబ్బంది వెంటనే అప్రమత్తమై, గాయపడిన మానీ మరియు వికాస్‌ను సమీపంలోని మాలిక్ హాస్పిటల్​కు తరలించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.

    Thar SUV | సోషల్ మీడియాలో వైరల్

    ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ (CCTV Footage)లో కార్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్లాస్‌ని పగులగొట్టి దూసుకెళ్లి కిందపడిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, ఈ ఘటనపై నెటిజెన్లు షాక్‌కు గురవుతున్నారు. “కొత్త కారు డ్రైవ్ చేసే ముందు కచ్చితంగా డ్రైవింగ్ నిపుణుల సహాయం తీసుకోవాలి. డ్రైవింగ్ అనుభవం లేకపోతే ఇదే జరుగుతుంది అంటూ’’ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రమాదం అనంతరం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, కొత్త వాహనాలు తీసుకునే వారు సేఫ్టీ ప్రమాణాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, డ్రైవింగ్ అనుభవం లేకుంటే ప్రొఫెషనల్ డ్రైవర్ సాయాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.

     

    View this post on Instagram

     

    A post shared by Akshara Today (@aksharatoday)

    More like this

    Chakali Ailamma | చాకలి ఐలమ్మ స్పూర్తి అందరికీ ఆదర్శం

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాటస్ఫూర్తి అందరికీ...

    TTD EO | టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్​కుమార్​ సింఘాల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TTD EO | టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌ (Anil Kumar Singhal) బుధవారం...

    Vice President Elections | క్రాస్ ఓటింగ్‌పై కాంగ్రెస్ పోస్టుమార్టం.. త్వ‌ర‌లోనే స‌మావేశం నిర్వహించే అవ‌కాశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Elections | ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో జ‌రిగిన క్రాస్ ఓటింగ్‌పై కాంగ్రెస్...