HomeజాతీయంDelhi molester baba | లైంగిక వేధింపుల కేసులో స్వామి చైతన్యానంద అరెస్టు .. ఢిల్లీలో...

Delhi molester baba | లైంగిక వేధింపుల కేసులో స్వామి చైతన్యానంద అరెస్టు .. ఢిల్లీలో కలకలం

Delhi molester baba | ఢిల్లీ Delhi వసంత్ కుంజ్‌లోని శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా పనిచేసిన స్వామి చైతన్యానంద Swami Chaitanyanananda సరస్వతి అలియాస్ స్వామి పార్థసారథి Swami Parthasarathy లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో చివరికి ఆగ్రాలో అరెస్టు అయ్యాడు.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అమ్మాయిలకు స్కాలర్‌షిప్ ఆధారంగా పోస్ట్-గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సులు అందించే ఈ సంస్థలో చదువుతున్న 17 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై అతను కొంతకాలంగా పరారీలో ఉన్నాడు.

Delhi molester baba | లైంగిక వేధింపులు..

ఢిల్లీ పోలీసులు Police ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించగా.. అతను ఆగ్రాలో ఉన్నట్టు గుర్తించి అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు మొత్తం 32 మంది విద్యార్థినుల వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు.

ఇందులో 17 మంది స్పష్టంగా నిందితుడిపై లైంగిక వేధింపులు, అసభ్య వ్యాఖ్యలు, అశ్లీల మెసేజ్‌లు పంపడం వంటి ఆరోపణలు గుప్పించారు.

అంతేకాక, మహిళా టీచర్లు, సిబ్బంది కూడా ఈ వేధింపులపై నోరు మూసేందుకు ఒత్తిడి చేశారని బాధితులు వెల్లడించారు.

దర్యాప్తులో భాగంగా.. పోలీసులు ఆశ్రమం బేస్‌మెంట్ నుంచి స్వామి ఉపయోగించిన వోల్వో కారును స్వాధీనం చేసుకున్నారు.

ఆశ్చర్యకరంగా.. ఆ కారు నకిలీ దౌత్య నంబరు ప్లేటుతో ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. దీంతో దౌత్య నంబరు ప్లేటు Fake number plate దుర్వినియోగంపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది తొలిసారి కాదు..

స్వామి చైతన్యానందపై 2009, 2016లో కూడా ఇలాంటి లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. అయితే అప్పట్లో తప్పుడు న్యాయ మార్గాల్లో కేసుల నుంచి బయటపడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

నిందితుడిని ప్రస్తుతం ఢిల్లీకి తరలించి, కోర్టు ఎదుట హాజరుపరిచారు. కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతున్నట్లుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో శ్రీ శృంగేరీ పీఠం (Sri Sringeri Peetham) లోని దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం ట్రస్టు బోర్డు Dakshinamnaya Sri Sarada Peetham Trust Board, స్వామి చైతన్యానందను డైరెక్టరు పదవి నుంచి తొలగించింది. దీంతోపాటు సంస్థతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకున్నట్లుగా ప్రకటించింది.

Must Read
Related News