ePaper
More
    HomeజాతీయంDelhi | జ‌ల దిగ్బంధంలో ఢిల్లీ

    Delhi | జ‌ల దిగ్బంధంలో ఢిల్లీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Delhi | భారీ వ‌ర్షాల‌తో దేశ రాజ‌ధాని (national capital) చిగురుటాకులా వణుకుతోంది. ఉరుములతో పాటు బ‌ల‌మైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఢిల్లీని ముంచెత్తాయి. దీంతో మహానగరంలోని పలు ప్రాంతాలు వరద నీటిలో (floodwaters) చిక్కుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఢిల్లీలోని అనేక ప్రాంతాలతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వ‌ర్షాలు, ఈదురుగాలులు విమాన స‌ర్వీసుల‌పై (flight services) తీవ్ర ప్ర‌భావం చూపాయి. దాదాపు 100 విమాన సర్వీసులపై వ‌ర్షం ప్రభావం పడిందని న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్ (New Delhi Airport) తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించింది. దాదాపు 60 విమానాల‌ను దారి మ‌ళ్లించారు. ప్రయాణికులు త‌మ ప్రయాణాలకు సంబంధించిన లాస్ట్ అప్ డేట్ చూసుకొని బయలుదేరాలని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు (Delhi Airport officials) సూచించారు. మింట్ రోడ్‌లో ఓ కారు నీట మునిగి పోయిన దృశ్యం వైర‌ల్ అయింది. వంద‌లాది వాహ‌నాలు నీళ్ల‌లో మునిగి దెబ్బ తిన్నాయి. రోడ్ల‌పై భారీ నీరు నిలువ‌డంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంత‌రాయం క‌లిగింది.

    Delhi | స‌హాయ‌క చ‌ర్య‌లు..

    సఫ్దర్‌జంగ్‌తోపాటు పలు ప్రాంతాల్లో 81 మిల్లీమీటర్ల రికార్డుస్థాయి వర్షపాతం నమోదైందని వాతావ‌ర‌ణ శాఖ (Meteorological Department) పేర్కొంది. దీంతో లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మరోవైపు నగర పాలక సంస్థ సిబ్బంది (municipal corporation staff) రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని తొల‌గించేందుకు య‌త్నిస్తున్నారు. ఇంకోవైపు ఢిల్లీతోపాటు దేశ రాజధానికి (national capital) సరిహద్దులుగా ఉన్న రాష్ట్రాల్లో సైతం రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 60 నుంచి 100 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.ఈ మేర‌కు ఢిల్లీ, సమీప ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ (red alert) చేసింది. భారీ ఉరుములు, బలమైన గాలులు వీచే అవ‌కాశ‌ముంద‌ని హెచ్చరించింది.

    More like this

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...