HomeUncategorizedDelhi CM | దాడిపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి.. తమ నిబద్ధతను విచ్ఛిన్నం చేయలేరన్న రేఖా...

Delhi CM | దాడిపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి.. తమ నిబద్ధతను విచ్ఛిన్నం చేయలేరన్న రేఖా గుప్తా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi CM | ఢిల్లీ సంక్షేమం కోసం చూపుతున్న తన నిబద్ధతను భౌతికు దాడుల చేయడం ద్వారా విచ్ఛిన్నం చేయలేరని ముఖ్యమంత్రి రేఖాగుప్తా (CM Rekha Gupta) అన్నారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో బుధవారం నిర్వహించిన జన్ సున్ వాయి కార్యక్రమం సందర్భంగా ఓ దుండగుడు ఆమెపై దాడి చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో దిగ్భ్రాంతికరమైన దాడి తర్వాత రేఖాగుప్తా స్పందిస్తూ ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఈ దాడి తనపైనే కాకుండా ఢిల్లీ ప్రజలపై (Delhi People) జరిగిన దాడి అని పేర్కొన్నారు. ఇది తనపైనే కాకుండా రాజధాని ప్రజలకు సేవ చేయాలనే తన నిబద్ధతపై జరిగిన పిరికి ప్రయత్నమని అన్నారు. ఈ దాడి నాపై మాత్రమే కాదు, ఢిల్లీ సంక్షేమం కోసం పనిచేయాలనే మా సంకల్పంపై కూడా జరిగిందని తెలిపారు.

Delhi CM | భయపడిపోయా..

దాడి సంఘటనతో తాను మొదట్లో భయానికి గురయ్యానని గుప్తా వెల్లడించారు. కానీ ఇప్పుడు కుదుట పడ్డానని తెలిపారు. తాను క్షేమంగా ఉన్నానని, పరామర్శ కోసం ఎవరూ రావొద్దని, అలా వచ్చి తమను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. త్వరలోనే ప్రజల మధ్యకు తిరిగి వస్తానని, మునుపటిలా పనిచేస్తానని ఆమె చెప్పారు.

Delhi CM | స్ఫూర్తిని దెబ్బ తీయలేరు..

దాడులతో (Attacks) తన స్ఫూర్తిని దెబ్బ తీయలేరని ముఖ్యమంత్రి తెలిపారు. “ఇటువంటి దాడులు నా స్ఫూర్తిని లేదా ప్రజా సేవ పట్ల నా అంకితభావాన్ని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేవని” ముఖ్యమంత్రి అన్నారు. మరింత శక్తివంతంగా మీకు సేవలందించడానికి వస్తానని ప్రకటించారు. ప్రజా ఫిర్యాదుల (public complaints)  విచారణ, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు మునుపటి నిబద్ధతతో కొనసాగుతాయని నొక్కి చెప్పారు. ప్రజలు చూపిస్తున్న అపారమైన ప్రేమ, ఆశీస్సులు, శుభాకాంక్షలకు గుప్తా కృతజ్ఞతలు తెలిపారు.