HomeజాతీయంDelhi Blast Case | ఢిల్లీ కారు బాంబు పేలుడు.. కశ్మీర్​లో ఎన్ఐఏ సోదాలు

Delhi Blast Case | ఢిల్లీ కారు బాంబు పేలుడు.. కశ్మీర్​లో ఎన్ఐఏ సోదాలు

ఢిల్లీ కారు బాంబు పేలుడు ఘటనలో ఎన్​ఐఏ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. కశ్మీర్​లోని 8 ప్రాంతాల్లో సోమవారం సోదాలు నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఇటీవల కారు బాంబు పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్న ఎన్​ఐఏ ఇప్పటికే పలువురిని అరెస్ట్​ చేసింది. తాజాగా జమ్మూకశ్మీర్​ (Jammu Kashmir)లోని పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

కశ్మీర్లోని 8 ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఎన్​ఐఏ అధికారులు (NIA Officers) తనిఖీలు ప్రారంభించారు. జమ్మూ కశ్మీర్ పోలీసు (Kashmir Police)లతో కలిసి జాతీయ దర్యాప్తు సంస్థ పుల్వామా, షోపియన్, కుల్గాం జిల్లాల్లోని ఎనిమిది ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. కీలక నిందితుడు జాసిర్ బిలాల్ వనీ ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టింది. డానిష్ అలియాస్ జాసిర్ బిలాల్ వనీ నవంబర్ 10న జరిగిన ఎర్రకోట కారు పేలుడులో కీలక కుట్రదారులలో ఒకరిగా గుర్తించారు.

Delhi Blast Case | వారి ఇళ్లలో సైతం

ఖాజీగుండ్‌ (Qazigund)లోని డాక్టర్ ఆదిల్, జాసిర్ బిలాల్, షోపియాన్‌లోని మౌల్వి ఇర్ఫాన్ ఇల్లు, పుల్వామాలోని కోయిల్‌లోని డాక్టర్ ముజ్మిల్ ఇల్లు, పుల్వామాలోని సంబురాలోని అమీర్ రషీద్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. జైష్-ఎ-మొహమ్మద్ అంతర్రాష్ట్ర వైట్-కాలర్ మాడ్యూల్ కుట్రను దర్యాప్తు చేస్తున్న జమ్మూ కశ్మీర్ పోలీసులు, NIA ఈ ప్రదేశాలన్నింటినీ గతంలో సోదా చేశాయి.

Delhi Blast Case | డ్రోన్లతో దాడికి ప్లాన్​

హమాస్ తరహా డ్రోన్ దాడులను ప్లాన్ చేయడంలో, సమన్వయంతో కూడిన పేలుళ్ల కోసం చిన్న, ముడి రాకెట్లను అభివృద్ధి చేయడంలో పుల్వామాకు చెందిన 28 ఏళ్ల వైద్యుడు నబీతో బిలాల్​ పనిచేశాడు. ఈ మాడ్యూల్ సాంకేతిక వెన్నెముక బిలాల్​ అని అధికారులు చెబుతున్నారు. అతను డ్రోన్‌లను, వాటి బ్యాటరీలు, కెమెరా వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేశాడు. ఈ కేసులో కీలక నిందితులను అరెస్ట్​ చేసిన అధికారులు దర్యాప్తులో వేగం పెంచారు.

Must Read
Related News