Homeక్రీడలుLSG vs DC | ఢిల్లీ క్యాపిటల్స్ విజయాల పరంపర..లక్నోపై 8 వికెట్ల తేడాతో గెలుపు

LSG vs DC | ఢిల్లీ క్యాపిటల్స్ విజయాల పరంపర..లక్నోపై 8 వికెట్ల తేడాతో గెలుపు

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: LSG vs DC : ఐపీఎల్​ 2025 లో ఢిల్లీ క్యాపిటల్స్ Delhi Capitals జట్టు విజయ పరంపర కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఢిల్లీ ఆరో గెలుపు నమోదు చేసింది. మంగళవారం లఖ్​నవూ సూపర్ జెయింట్స్​(Lucknow Supergiants)తో జరిగిన మ్యాచ్​లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ జట్టు నెగ్గింది.

లఖ్​వవూ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు 17.5 ఓవర్లలోనే అలవోకగా ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ పోరెల్ (51), కేఎల్ రాహుల్ (57) అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు. అక్షర్ పటేల్ (34) కూడా రాణించాడు. లఖ్​నవూ బౌలర్లలో మర్​క్రమ్​ 2 వికెట్లు పడగొట్టాడు.