అక్షరటుడే, న్యూఢిల్లీ: Delhi Blast | దేశ రాజధాని national capital ఢిల్లీలో Delhi సోమవారం సాయంత్రం సంభవించిన భారీ పేలుడు దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోట (లాల్ ఖిలా) Red Fort (Lal Qila) సమీపంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
లాల్ ఖిలా మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలిపి ఉంచిన ఒక ఐ20 కారు అకస్మాత్తుగా పేలిపోయింది. పేలుడు తీవ్రతకు అక్కడున్న అనేక వాహనాలు బుగ్గి అయ్యాయి.
ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
పేలుడు శబ్దం దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Delhi Blast | సంచలన విషయాలు వెలుగులోకి..
దేశంలో ఇప్పటికే భద్రతా బలగాలు ఒక పెద్ద ఉగ్రకుట్రను భగ్నం చేసి, భారీ మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల్లోనే ఈ పేలుడు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.
దీంతో భద్రతా విభాగాలు దీన్ని ఉగ్రదాడి కోణంలోనే పరిశీలిస్తున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ National Investigation Agency (ఎన్ఐఏ), ఫోరెన్సిక్ విభాగాలు, క్లూస్ బృందాలు ఇప్పటికే ఘటనాస్థలంలో పరిశీలనలు ప్రారంభించాయి.
పేలుడుకు ఉపయోగించిన పేలుడు పదార్థం రకం, దాని మూలం, ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయా.. అనే అంశాలపై లోతుగా విచారణ జరుగుతోంది.
ప్రాథమిక దర్యాప్తులో ఈ పేలుడు జరిగిన ఐ20 కారుకు పుల్వామా Pulwama ప్రాంతంతో సంబంధం ఉన్నట్లు బయటపడింది.
కారు చివరిసారిగా పుల్వామాకు చెందిన తారిఖ్ అనే వ్యక్తి పేరుతో రిజిస్టర్ చేయబడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో దర్యాప్తు అధికారులు జమ్మూకశ్మీర్ వైపు దృష్టి సారించారు.
ఈ ఘటన తర్వాత దేశమంతటా రెడ్ అలర్ట్ Red Alert ప్రకటించారు. ఢిల్లీలోనే కాకుండా ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, మాల్స్ వంటి ప్రదేశాల్లో ముమ్మర తనిఖీలు జరుగుతున్నాయి. అయితే ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో మూడు గంటల పాటు ఐ20 కారు నిలిపి ఉంచినట్టు కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి.
ఈ కారు సోమవారం మధ్యాహ్నం 3:19 గంటలకు పార్కింగ్ స్థలంలోకి రాగా, సాయంత్రం 6:48 గంటలకు పార్కింగ్ స్థలం నుంచి బయలుదేరింది.
6:52 గంటలకు పేలుడు ఘటన జరిగిందని అధికారులు స్పష్టం చేశారు. ఈ పేలుడు వెనుక ఉగ్రవాదుల ముఠా ఉందా.. లేక యాదృచ్ఛిక ప్రమాదమా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.