అక్షరటుడే, వెబ్డెస్క : Delhi Blast | ఢిల్లీలో పేలుడు ఘటనతో యావత్ దేశం ఉలిక్కి పడింది. ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రదాడి (Pahalgam Attack) జరిగింది. అప్పటి నుంచి కేంద్ర ఏజెన్సీలు అప్రమత్తంగా ఉంటూ దేశంలోని పలు ప్రాంతాల్లో అనేక మంది ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్ట్ చేశాయి. పలువురు డాక్టర్లను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఢిల్లీలో కారు పేలుడు చోటు చేసుకుంది.
ఢిల్లీ పేలుడులో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారు. పలువురు గాయపడి చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి రూ.5లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బాధితులకు అండగా ఉంటామని తెలిపింది.
Delhi Blast | ఆ యూనివర్సిటీ జూడాల అరెస్ట్
ఢిల్లీ ఎర్రకోట (Red Fort) పేలుడు ఘటనలో అల్ ఫలహ్ యూనివర్సిటీ (Al Falah University)కు చెందిన ఆరుగురు జూనియర్ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 2019 నుంచి ఈ యూనివర్సిటీ ఎంబీబీఎస్ కోర్సులు అందిస్తోంది. ఇందులో చదువుతున్న వారిలో 40 శాతం కశ్మీరీలు ఉన్నారు. యూనివర్సిటీ ప్రొఫెసర్గా డాక్టర్ ఉమర్ ఉండటం గమనార్హం. దీంతో అతడు విద్యార్థులను ఉగ్రవాదం వైపు మళ్లించాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పేలుడు సూత్రధారి ఉమర్ అని ఇప్పటికే అధికారులు గుర్తించారు. అయితే కారులో పేలుడు సమయంలో అతడు ఉన్నాడా.. లేడా అనేదానిపై స్పష్టత లేదు. దీని కోసం కశ్మీర్‌లోని అతని కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ నమూనాలను సైతం అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. కారులో ఓ వ్యక్తి శరీర భాగాలు గుర్తించారు. డీఎన్ఏ టెస్ట్ అనంతరం అవి ఉమర్వా.. కాదా అనేది తేలనుంది.
