HomeతెలంగాణTelangana University | తెయూలో దోస్త్ ప్రత్యేక కేటగిరి ధ్రువపత్రాల పరిశీలన

Telangana University | తెయూలో దోస్త్ ప్రత్యేక కేటగిరి ధ్రువపత్రాల పరిశీలన

- Advertisement -

అక్షర టుడే, డిచ్ పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో (degree colleges) ప్రవేశాలకు దోస్త్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రత్యేక కేటగిరి విద్యార్థుల ధ్రువపత్రాలు సోమవారం పరిశీలించారు. ఈ మేరకు అడ్మిషన్స్ కార్యాలయంలో (Admissions Office) రెండు రోజులుగా ధ్రువపత్రాలు పరిశీలించగా, ప్రత్యేక కేటగిరి ఎన్సీసీలో ముగ్గురు, స్పోర్ట్స్ కోటాలో నలుగురు విద్యార్థులు అడ్మిషన్ పొందినట్లు దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ డా రామస్వామి, వర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ డా నేత, టెక్నికల్ అసిస్టెంట్ నరేష్, రవీందర్ నాయక్ పాల్గొన్నారు.