Homeతాజావార్తలుHarish Rao | అసెంబ్లీ నిర్వహణలో లోపాలు.. స్పీకర్​కు హరీశ్​రావు లేఖ

Harish Rao | అసెంబ్లీ నిర్వహణలో లోపాలు.. స్పీకర్​కు హరీశ్​రావు లేఖ

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​కు మాజీ మంత్రి హరీశ్​రావు బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ నిర్వహణలో లోపాలను ఎత్తి చూపారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​కు (Speaker Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్​రావు బహిరంగ లేఖ రాశారు. స్పీకర్​ రెండేళ్ల పదవికాలం పూర్తి చేసుకోవడం శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో అసెంబ్లీ నిర్వహణలో లోపాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

అసెంబ్లీ ప్రతిష్ఠను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో పొరపాట్లు జరుగుతున్నాయని హరీశ్​రావు (Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ పని దినాలు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్ 12 ప్రకారం సభ నిర్వహించడం లేదన్నారు. సరైన కారణాలు లేకుండా సభను తరచూగా వాయిదా వేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ కుదించారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టార్ గుర్తు లేని ప్రశ్నలకు సభ్యులు సమాధానాలు అందుకోలేదని చెప్పారు.

Harish Rao | డిప్యూటీ స్పీకర్​ పదవి

దాదాపు 2 సంవత్సరాలుగా హౌస్ కమిటీలు (House committees) ఏర్పాటవలేదని పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి ఇప్పటికీ ఖాళీగా ఉందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు (Supreme Court) రిమైండర్లు ఇచ్చినప్పటికీ అనర్హత కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. పారదర్శకత, జవాబుదారీతనం సరైన శాసనసభ పనితీరును పునరుద్ధరించడానికి వెంటనే చర్య తీసుకోవాలని కోరారు.

ఒక ప్రశ్నకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకునేందుకు సభ్యులకు ఉండే సప్లిమెంటరీ క్వశ్చన్స్ అవకాశాన్ని నిరాకరించడం, కుదించడం రూల్ 50 ప్రధాన ఉద్దేశానికి విఘాతం కలిగించడమేనని అన్నారు. రూల్ 41 ప్రకారం నిర్ణీత గడువులోగా సభ్యులకు సమాధానాలు అందించాలని డిమాండ్​ చేశారు. ఎస్టిమేట్స్ కమిటీని మళ్లీ ఏర్పాటు చేయలేదన్నారు.

Must Read
Related News