అక్షరటుడే, హైదరాబాద్: defected MLAs : ఎన్నో నాటకీయ పరిణామాల తర్వాత తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పందించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం జోక్యంతో వెనక్కి తగ్గారు. తాము బీఆర్ఎస్ BRS లోనే కొనసాగుతున్నట్లు చెప్పుకొచ్చారు.
“సీఎం CM స్థాయి వ్యక్తి కండువా కప్పుతున్నప్పుడు.. తిరస్కరించడం సంస్కారం కాదనే భావనతో కండువా కప్పుకున్నాం.. మేము పార్టీ మారలేదు.. బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాం..” అని స్పీకర్‌కు పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సుప్రీంకోర్టు Supreme Court ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు ఎమ్మెల్యే నుంచి వివరణ కోరుతూ స్పీకర్ నోటీసులు జారీ చేశారు.
defected MLAs : మరికొంత సమయం కావాలని..
స్పీకర్ కార్యాలయం నుంచి 10 మంది ఎమ్మెల్యేలు నోటీసులు అందుకున్నారు. వీరిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరెకపూడి గాంధీ, సంజయ్, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు.
సమాధానాలివ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని స్పీకర్ Speaker ను ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి Kadiyam Srihari , దానం నాగేందర్ Danam Nagender కోరినట్లు సమాచారం.
తమపై చేసిన ఆరోపణలపై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరణలో ఏముందంటే..
“నేను పార్టీ మారలేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాను.. నేనెక్కడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు.. ఆ పార్టీకి రాజీనామా చేయలేదు.. అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశా.. ఆ సందర్భంగా సీఎం మర్యాదపూర్వకంగా కండువా కప్పారు. సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పుతున్నప్పుడు.. తిరస్కరించడం సంస్కారం కాదనే భావనతో వేయించుకున్నా.. అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు..” అంటూ దాదాపు అందరూ ఇదే తీరున వివరణ ఇచ్చినట్లు తెలిసింది.
