అక్షరటుడే, ఆర్మూర్: Nizamabad CP | ఓటమి గెలుపునకు నాంది అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఆర్మూర్ ఉమ్మడి మండలస్థాయి వాలీబాల్ , కబడ్డీ పోటీల (volleyball and kabaddi competitions) ముగింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ మాట్లాడుతూ..ఓటమి చెందిన వారి నిరుత్సాహపడకూడదని రెట్టించిన ఉత్సాహంతో విజయం కోసం కృషి చేయాలని సూచించారు. అనతరం ఆయన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పోలీస్ వర్సెస్ జర్నలిస్ట్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లో విజేతలుగా నిలిచిన వారికి సైతం ఆయనబహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఎస్హెచ్వో సత్యనారాయణ, ఆలూరు రాజగంగారాం, నరేందర్, పాఠశాల హెచ్ఎం లక్ష్మీనర్సయ్య, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
