ePaper
More
    HomeతెలంగాణMP Arvind | కేసీఆర్ స‌హా అంద‌రికీ ఓట‌మి త‌ప్ప‌దు.. వారిని ర‌ప్పా ర‌ప్పా జైలులో...

    MP Arvind | కేసీఆర్ స‌హా అంద‌రికీ ఓట‌మి త‌ప్ప‌దు.. వారిని ర‌ప్పా ర‌ప్పా జైలులో ప‌డేయాల‌న్న అర్వింద్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: MP Arvind | బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని.. ఏ ఎన్నిక‌ల్లోనైనా ఆ పార్టీకి ఓట‌మి త‌ప్ప‌ద‌ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Arvind) అన్నారు. ప‌దేళ్ల‌లో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను భ్ర‌ష్టు ప‌ట్టించిన ఆ పార్టీని ప్ర‌జ‌లు ఛీద‌రించుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. హ‌రీశ్‌రావు ధ‌ర్నాలో ర‌ప్పా ర‌ప్పా 3.0 అని ప్ర‌ద‌ర్శించిన ప్ల‌కార్డుల‌పై అర్వింద్ సెటైర్లు వేశారు. ‘వాళ్ల మొహాల‌కు 3.0 ఏంటి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మూడు సీట్లు వ‌స్తే గొప్ప’ అని ఎద్దేవా చేశారు. ‘ప్ర‌పంచంలోనే అత్య‌ధిక అవినీతికి పాల్ప‌డిన బీఆర్ఎస్ నేత‌ల‌ను గ‌ప్పా గ‌ప్పా గుద్ది ర‌ప్పా ర‌ప్పా జైలులో వేయాలని’ డిమాండ్ చేశారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు(Kalvakuntla Chandrasekhara Rao) ముసలోడు అయిండ‌ని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ లేదని సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయ‌న కొడుకు కేటీఆర్(KTR), బిడ్డ కవిత(Kavitha) పోటీ చేసినా కూడా ఓడిపోతారన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాల‌యం(BJP Office)లో అర్వింద్ విలేక‌రుల‌తో మాట్లాడారు.

    MP Arvind | మిలాకత్ అయితే పుట్ట‌గ‌తులుండ‌వు..

    కాంగ్రెస్ పార్టీ(Congress Party) చేప‌డుతున్న ద‌ర్యాప్తుల‌ను నిష్ప‌క్షపాతంగా కొన‌సాగించాల‌ని అర్వింద్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఉదయం బీఆర్ఎస్​ను బెదిరించి, సాయంత్రం మిలాఖత్ అవ్వొద్దని సూచించారు. మిలాఖత్ అయితే మాత్రం కాంగ్రెస్‌కు పుట్టగతులు ఉండవని హెచ్చ‌రించారు. కేసీఆర్‌, కేటీఆర్‌, క‌విత‌, హ‌రీశ్‌రావు.. ఇలా క‌ల్వ‌కుంట్ల కుటుంబ‌మంతా తీవ్ర అవినీతికి పాల్ప‌డింద‌ని, వారందరినీ జైలులో వేయాల‌ని డిమాండ్ చేశారు. అవినీతి కేసుల్లో వారిని వ‌దిలిపెడితే రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితం భూ స్థాపితం అవుతుంద‌ని హెచ్చ‌రించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) తప్ప, ఎవరూ గెలవరని జోస్యం చెప్పారు. హరీశ్‌రావును సిద్దిపేటలో ఓడించడం చాలా కష్టమని, ఆయన సిద్దిపేట వదిలేస్తే ఓడిపోవడం పక్కా అని తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఓటమి తప్పదన్నారు.

    MP Arvind | 29న అమిత్ షా ప‌ర్య‌ట‌న‌..

    కేంద్ర హోం శాఖ మంత్రి(Amith Shah) ఈ నెల 29న నిజామాబాద్ జిల్లాలో పర్యటించ‌నున్నార‌ని అర్వింద్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప‌సుపుబోర్డు కార్యాల‌యాన్ని ఆయ‌న ప్రారంభిస్తార‌ని చెప్పారు. నిజామాబాద్ వేదికగా పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు కొత్త శకం ప్రారంభమైందన్నారు. అలాగే దివంగత నేత డి.శ్రీనివాస్ విగ్రహావిష్కరణ(D. Srinivas statue Unveiling) చేయనున్నట్లు వివరించారు. అనంతరం స్థానిక పాలిటెక్నీక్ కళాశాల మైదానం(Polytechnic College Ground)లో రైతు సమ్మేళనం పేరిట కార్యక్రమం నిర్వహిస్తామని అర్వింద్ పేర్కొన్నారు.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...