Deepika Padukone
Deepika Padukone | కల్కి 2 నుంచి దీపికా పదుకొనే తప్పుకున్నట్లు అధికారిక ప్రకటన. అందరు షాక్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Deepika Padukone | టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటైన ‘కల్కి 2’ నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తప్పుకున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, ప్ర‌భాస్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ ‘కల్కి 2898 AD’ కి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.మొదటి భాగంలో దీపికా(Deepika Padukone), దిశా పటానీ(Disha Patani) హీరోయిన్లుగా నటించగా, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, శోభన తదితరులు కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్(Vyjayanthi Movies) నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Deepika Padukone | దీపికా ఔట్..

అయితే, ఈ రోజు (సెప్టెంబర్ 18) చిత్రబృందం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందులో కల్కి 2(Kalki 2)లో దీపికా పదుకొనే భాగం కావడంలేదని మేము అధికారికంగా ధృవీకరిస్తున్నాం. అనేక విషయాలను పరిశీలించిన అనంతరం, మా భాగస్వామ్యం కొనసాగదని నిర్ణయించుకున్నాం. పార్ట్ 1 కోసం మేము చాలా దూరం ప్రయాణించాం, కానీ సీక్వెల్‌లో ఆ అనుబంధం కొనసాగలేకపోయింది. కల్కి లాంటి సినిమాలకు ఎంతో నిబద్ధత అవసరం. దీపికా భవిష్యత్‌లో మరెన్నో విజయాలు సాధించాలని మేము కోరుకుంటున్నాం” అని పేర్కొన్నారు.

ఈ ప్రకటనతో ‘కల్కి 2’లో హీరోయిన్ స్థానంలో ఎవరిని తీసుకుంటారు? అన్న అంశంపై అభిమానులు, సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. త్వరలోనే చిత్రబృందం కొత్త హీరోయిన్ పేరు ప్రకటించే అవకాశముంది.