HomeతెలంగాణWarangal Congress | వ‌రంగ‌ల్ కాంగ్రెస్‌లో ముదిరిన విభేదాలు.. కొండా సురేఖ‌పై పీసీసీకి ఎమ్మెల్యే ఫిర్యాదు

Warangal Congress | వ‌రంగ‌ల్ కాంగ్రెస్‌లో ముదిరిన విభేదాలు.. కొండా సురేఖ‌పై పీసీసీకి ఎమ్మెల్యే ఫిర్యాదు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Warangal Congress | వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో (Congress Party) విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. అట‌వీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై ఆమె వ్య‌తిరేక వ‌ర్గం పీసీసీకి ఫిర్యాదు చేసింది. మంత్రి కొండా సురేఖపై వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్‌రెడ్డి (MLA Nayini Rajender Reddy) మండిప‌డ్డారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు తెలియ‌కుండా భ‌ద్ర‌కాళి ఆల‌య పాల‌క మండ‌లిని నియ‌మించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఆయ‌న పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు (Mahesh Kumar Goud) ఫిర్యాదు చేశారు. తన నియోజకవర్గంలోని భద్రకాళి దేవస్థానంలో తనకు సమాచారం ఇవ్వకుండా ఇద్దరు ధర్మకర్తలు నియమిస్తూ కొండా సురేఖ ఉత్తర్వులు జారీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Warangal Congress | పార్టీకి న‌ష్టం..

కొండా సురేఖ వ్య‌వ‌హార శైలిపై నాయిని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆమె ఏక‌ప‌క్ష వైఖ‌రి పార్టీకి తీవ్ర న‌ష్టం క‌లిగిస్తుంద‌ని తెలిపారు. కొండా సురేఖ (Minister Konda Surekha) ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఇలాగే కొనసాగితే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని పీసీసీ చీఫ్‌కు చేసిన ఫిర్యాదులో తెలిపారు. జిల్లా ఎమ్మెల్యేల‌ను (District MLA) ప‌ట్టించుకోకుండా ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకోవ‌డం పార్టీకి మంచిది కాద‌ని పేర్కొన్నారు. తాము ఏది చేసినా నడుస్తోందని మంత్రి కొండా సురేఖ అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా భద్రకాళీ ఆలయ పాలక మండలి సభ్యులను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. దేవాదాయశాఖకు మంత్రి (Endowments Minister) అయినంత మాత్రానా ఏదైనా చేయొచ్చా..? అని నిలదీశారు.

Warangal Congress | ఓపిక‌ను ప‌రీక్షించొద్దు..

మంత్రి కొండా సురేఖ ఇష్ట‌మొచ్చిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుంటే చూస్తూ ఊరుకోమ‌ని నాయిని స్ప‌ష్టం చేశారు. తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనం చేయ‌డం ఏమిట‌ని ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖ ఇదే పద్ధతి అవలంభిస్తే చూస్తూ ఊరుకోమ‌న్నారు. అంతా మంత్రి చేశాక స్థానికంగా తాను ఉన్నది ఎందుక‌ని అని ప్ర‌శ్నించారు. తన ఓపికకు పరీక్ష పెట్టవద్దని సూచించారు. మంత్రి అంటే అందరినీ సమన్వయం చేయాలని సూచించారు.

Must Read
Related News