అక్షరటుడే, ఇందూరు : Deeksha Divas | జిల్లాలో ఈనెల 29న నిర్వహించనున్న దీక్ష దివస్ (Deeksha Divas)ను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా (Former MLA Bigala Ganesh Gupta) పిలుపునిచ్చారు. ఈ మేరకు నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ (KCR) దీక్షను చేపట్టారని గుర్తు చేశారు. దశాబ్దాల కాలం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దీక్షా దివస్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy), బోధన్ నాయకురాలు అయేషా ఫాతిమా, మాజీ మేయర్ దండు నీతో కిరణ్ శేఖర్, మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్, నగర అధ్యక్షుడు రాజు, నూడ మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.