ePaper
More
    HomeతెలంగాణEagle Team | గచ్చిబౌలిలో డెకాయ్​ ఆపరేషన్​.. గంజాయి కొనుగోలు చేస్తుండగా 86 మంది పట్టివేత

    Eagle Team | గచ్చిబౌలిలో డెకాయ్​ ఆపరేషన్​.. గంజాయి కొనుగోలు చేస్తుండగా 86 మంది పట్టివేత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Eagle Team | రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్​ వంటి మాదక ద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగింది. గత పదేళ్లలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం గంజాయి విక్రయాలు పెరిగాయి. గతంలో పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన గంజాయి, డ్రగ్స్​ ప్రస్తుతం మారుమూల ప్రాంతాలకు విస్తరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

    ఎంతోమంది యువత వీటికి బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చడానికి చర్యలు చేపడుతామని ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించిన విషయం తెలిసిందే.

    ఈ మేరకు ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్​ Drugs ఆట కట్టించడానికి ఈగల్​ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఎక్కడ గంజాయి Ganja కనిపించినా ఈ గద్ద(ఈగల్​) వాలిపోతుందని గతంలో సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు ఇటీవల ఈగల్​ టీం పోలీసులు (Eagle Team police) హైదరాబాద్​ నగరంలో దాడులు చేపడుతున్నారు. గంజాయి, డ్రగ్స్​ విక్రేతలు, కొనేవారికి చుక్కలు చూపిస్తున్నారు.

    READ ALSO  Local Body Elections | స్థానిక ఎన్నికలపై కీలక అప్​డేట్​.. డీపీవోలకు ఆదేశాలు జారీ

    Eagle Team | గచ్చిబౌలిలో బాయ్​ బచ్చా ఆగయా..

    గచ్చిబౌలి(Gachibowli)లో శుక్రవారం(జులై 18) ఈగల్‌ టీమ్‌ డెకాయ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. గంజాయి కొనుగోలు చేస్తుండగా 86 మందిని ఈగల్​ టీం పట్టుకొంది. పట్టుబడిన వారిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, డెంటల్‌ టెక్నిషియన్స్‌, విద్యార్థులు, మార్కెటింగ్‌ ఉద్యోగులు, హెచ్‌ఆర్‌ మేనేజర్లు ఉన్నారు. ‘బాయ్‌ బచ్చా ఆగయా’ అంటూ వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా గంజాయి అమ్మకాలు చేపడుతున్నట్లు ఈగల్​ టీం గుర్తించింది. గచ్చిబౌలిలో ఇటీవలే 14 మంది పట్టుబడ్డారు.

    Eagle Team | ఇటీవలే 14 మంది.. 

    ఈగల్​ టీం ఇటీవల కొంపల్లిKompally లోని మల్నాడు రెస్టారెంట్​పై (Malnadu restaurant) దాడి చేసి, పెద్ద డ్రగ్స్​ రాకెట్​ గుట్టు రట్టు చేసిన విషయం తెలిసిందే. ఈ రెస్టారెంట్ యజమాని సూర్య పలువురు పబ్​ యజమానులతో కలిసి డ్రగ్స్​ దందా చేస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. తర్వాత ఈగల్​ టీం గచ్చిబౌలిలోనూ డెకాయ్​ ఆపరేషన్​ నిర్వహించింది. రెండు గంటల వ్యవధిలో 14 మంది గంజాయి వినియోగదారులను పట్టుకుంది. అయితే వీరు కూడా గంజాయి విక్రయించడానికి ‘‘బాయి బచ్చా ఆగయా బాయి’’ అనే కోడ్ భాషను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

    READ ALSO  Gutta Sukhender Reddy | ఉచిత ప‌థ‌కాల‌ను నియంత్రించాలి.. నేత‌లు భాష మార్చుకోవాల‌న్న మండ‌లి ఛైర్మన్​

    Eagle Team | ఐటీ కారిడార్​లో ఆపరేషన్​

    మొదట గంజాయి విక్రేతను అరెస్టు చేసిన పోలీసులు.. అతని ఫోన్​ నుంచి ‘‘బాయి బచ్చా ఆగయా బాయి’’ అని మేసేజ్​ పంపారు. దీంతో గంజాయి కొనుగోలు చేయడానికి 14 మంది వచ్చారు. గచ్చిబౌలి హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు సమీపంలో ఈ ఆపరేషన్​ నిర్వహించారు. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది 20 ఏళ్లలోపు వారే ఉండటం గమనార్హం. వీరిలో నలుగురు ఐటీ ఉద్యోగులు, ఒక విద్యార్థి, ఒక ట్రావెల్ ఏజెన్సీ యజమాని ఉన్నారు.

    Eagle Team | గంజాయి కోసం నాలుగేళ్ల బిడ్డతో..

    మొన్న ఈగల్​ టీం జరిపిన ఆపరేషన్​లో ఓ జంట తమ నాలుగేళ్ల బిడ్డతో కలిసి గంజాయి కొనడానికి వచ్చారు. వారిని చూసి ఈగల్​ టీం సభ్యులే షాక్​ అయ్యారు. మరో ఇద్దరు దంపతులు సైతం గంజాయి కొనడానికి రాగా.. అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

    READ ALSO  Harish Rao | యాసంగి వడ్లకు బోనస్​ ఇవ్వని ప్రభుత్వం : హరీశ్​రావు

    Latest articles

    IAS Postings | ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలువురు ఐఏఎస్​లకు సబ్​ కలెక్టర్లుగా పోస్టింగ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAS Postings | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2023 బ్యాచ్ ఐఏఎస్...

    TOMCOM | ఇంజినీరింగ్​ విద్యార్థులకు గుడ్​న్యూస్​.. జపాన్​లో ఉద్యోగ అవకాశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TOMCOM | ఇంజినీరింగ్​ పూర్తి చేసిన విద్యార్థులకు టామ్​కామ్​ (TOMCOM) గుడ్​ న్యూస్​ చెప్పింది....

    Medak | లారీ ఆపమంటే ఢీకొని వెళ్లాడు.. మెదక్​లో హిట్​ అండ్​ రన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Medak | మెదక్​ (Medak) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ...

    Pune | బాత్‌రూం వీడియోల‌తో అర్ధాంగిని బ్లాక్‌మెయిల్ చేసిన ప్రభుత్వ అధికారి.. షాక్‌లో పోలీసులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pune | పూణె సమీపంలోని అంబేగావ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రభుత్వ...

    More like this

    IAS Postings | ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలువురు ఐఏఎస్​లకు సబ్​ కలెక్టర్లుగా పోస్టింగ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAS Postings | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2023 బ్యాచ్ ఐఏఎస్...

    TOMCOM | ఇంజినీరింగ్​ విద్యార్థులకు గుడ్​న్యూస్​.. జపాన్​లో ఉద్యోగ అవకాశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TOMCOM | ఇంజినీరింగ్​ పూర్తి చేసిన విద్యార్థులకు టామ్​కామ్​ (TOMCOM) గుడ్​ న్యూస్​ చెప్పింది....

    Medak | లారీ ఆపమంటే ఢీకొని వెళ్లాడు.. మెదక్​లో హిట్​ అండ్​ రన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Medak | మెదక్​ (Medak) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ...