Homeజిల్లాలునిజామాబాద్​TRSMA | బీసీ బంద్​కు ట్రస్మా మద్దతు.. విద్యాసంస్థలకు సెలవు

TRSMA | బీసీ బంద్​కు ట్రస్మా మద్దతు.. విద్యాసంస్థలకు సెలవు

బీసీ బంద్​కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా ట్రస్మా పేర్కొంది. ఈ సందర్భంగా 18న విద్యాసంస్థలను మూసివేయాలని నిర్ణయించింది.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: TRSMA | బీసీ రిజర్వేషన్లకు (BC Reservations) అడ్డుకుంటున్న తీరును నిరసిస్తూ ఈనెల 18న జరుగనున్న రాష్ట్రవ్యాప్త బంద్​కు అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే వ్యాపార, వాణిజ్యసంస్థలు, ఆయా సంఘాలు బంద్​కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అలాగే పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​ సైతం కాంగ్రెస్​ తరపున బంద్​కు సహకరిస్తామని పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ సైతం నిరసనలో పాల్గొంటామని స్పష్టం చేసింది..

TRSMA | విద్యాసంస్థలు సైతం..

బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్​కు తాము మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (TRSMA) ప్రకటించింది.

ఈ మేరకు ట్రస్మా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుందర్, అనుముల క్రాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఈనెల 18న బంద్ పాటించి బీసీలకు మద్దతు తెలిపాలని కోరారు.