అక్షరటుడే, హైదరాబాద్: Dec 25 Gold Prices | బంగారం ధరలు Gold Rates గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతోంది. కొద్ది రోజులగా పెరుగుతున్న గోల్డ్ రేట్లు ఇవాళ మరోసారి పెరగడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితులు బంగారం పెరిగేందుకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.
ఇటీవల యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో .. వచ్చే ఏడాది కూడా ఇదే పంథా అనుసరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బంగారం, వెండిని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్స్ అటు వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారని అంటున్నారు. సాధారణంగానే ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించినప్పుడు.. డాలర్ డిమాండ్ తగ్గి బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో బంగారం ధర కూడా పెరుగుతుంటుంది. ఇప్పుడదే జరుగుతుందని అంటున్నారు.
పరుగో పరుగు..
దేశవ్యాప్తంగా బంగారం ధరల పెరుగుదల క్రమంగా కొనసాగుతూనే ఉంది. పసిడి రేట్లకు బ్రేక్ పడకపోవడంతో సామాన్యులు, మధ్యతరగతి వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం నుంచి భారీగా పెరుగుతున్న బంగారం ధరలు గురువారం Thursday కూడా ఆకాశాన్నంటాయి. ఇవాళ మరోసారి స్వల్పంగా పెరిగి షాక్ ఇచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేటి బంగారం ధరలు (10 గ్రాములు)
- హైదరాబాద్లో 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ : ₹ 1,38,940 కాగా (నిన్న ₹ 1,38,930) – 22 క్యారెట్ల గోల్డ్: ₹ 1,27,360 (నిన్న ₹ 1,27,350)గా ఉంది.
- విజయవాడ 24 క్యారెట్లు: ₹ 1,38,940 – 22 క్యారెట్లు: ₹ 1,27,360గా ట్రేడ్ అయింది.
- విశాఖపట్నంలో 24 క్యారెట్లు: ₹ 1,38,940 – 22 క్యారెట్లు: ₹ 1,27,360గా ట్రేడ్ అయింది.
- బెంగళూరులో 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్: ₹ 1,38,940 కాగా – 22 క్యారెట్ల గోల్డ్: ₹ 1,27,360గా ఉంది.
- చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్: ₹ 1,39,650 (నిన్న ₹1,39,640)గా ట్రేడ్ అయింది.
ఇక వెండి ధరలు (కిలో)కి చెన్నై: ₹ 2,44,100గా ట్రేడ్ కాగా, హైదరాబాద్: ₹ 2,44,100, విజయవాడ: ₹ 2,44,100 , విశాఖపట్నం: ₹ 2,44,100, బెంగళూరు: ₹ 2,33,100గా ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరల పెరుగుదల, డాలర్ Dollar మారకపు విలువల్లో మార్పులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటి కారణాలతో పసిడి ధరలు ఎగబాకుతున్నాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.