అక్షరటుడే, హైదరాబాద్: Dec 31 Gold Prices | దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతూ సామాన్య వినియోగదారులకు ఊరటనిచ్చే స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డాలర్ Dollar బలపడటం, పెట్టుబడిదారుల లాభాల స్వీకరణ వంటి కారణాలతో బంగారం ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. నిన్న ఒక్కరోజే బంగారం ధర రూ.3 వేలకుపైగా పడిపోగా, గత మూడు రోజుల్లో ఏకంగా రూ.6 వేలకుపైగా తగ్గింది. డిసెంబర్ 31న దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,190గా ఉండగా, ప్రస్తుతం అదే రూ.1,24,840 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో వెండి ధరల్లోనూ భారీ మార్పు కనిపించింది. మంగళవారం ఒక్కరోజే కిలో వెండి ధర దాదాపు రూ.18 వేల వరకు పడిపోగా, గత మూడు రోజుల కిందటి ధరతో పోలిస్తే దేశవ్యాప్తంగా మొత్తం రూ.19 వేల వరకు తగ్గింది.
Dec 31 Gold Prices | పడిపోతున్న ధరలు..
ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.2,39,900 వద్ద ఉండగా, హైదరాబాద్లో Hyderabad మాత్రం ఇతర నగరాలతో పోలిస్తే ఎక్కువగా రూ.2,57,900 వద్ద కొనసాగుతోంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పరిశీలిస్తే హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,190గా, 22 క్యారెట్ల ధర రూ.1,24,840గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,36,340గా, 22 క్యారెట్ల ధర రూ.1,24,990గా నమోదైంది. చెన్నైలో మాత్రం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,450గా, 22 క్యారెట్ల ధర రూ.1,25,990గా ఉండటం గమనార్హం.
దేశవ్యాప్తంగా ఒకే రేటు నిర్ణయించకపోవడంతో స్థానిక పన్నులు, నగల తయారీ ఛార్జీలు, రవాణా వ్యయాలు వంటి అంశాల వల్ల ప్రతి నగరానికి బంగారం ధరల్లో తేడాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా దక్షిణ భారత నగరమైన చెన్నైలో బంగారం ధరలు ఇతర ప్రాంతాలతో పోలిస్తే వేగంగా పెరగడం, అలాగే తగ్గడం సాధారణంగా కనిపిస్తుంటుంది. తాజాగా వచ్చిన ఈ భారీ ధరల పతనంతో పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం Gold కొనాలనుకునే వారికి ఇది అనుకూల సమయంగా మారిందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.