అక్షరటుడే, హైదరాబాద్: Dec 30 Gold Prices | దేశంలో బంగారం, వెండి ధరలు Silver Prices స్వల్పంగా తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా భారీగానే కొనసాగుతున్నాయి. ఇటీవల తులం బంగారం ధర రూ.1,42,000 మార్క్‌ను దాటిన విషయం తెలిసిందే. తాజా మార్కెట్ ప్రకారం మంగళవారం తులం బంగారం ధర రూ.1,39,240కు చేరింది. అంటే దాదాపు రూ.2,000 వరకు తగ్గుదల కనిపించినప్పటికీ, సామాన్య వినియోగదారుడు కొనుగోలు చేయాలంటే ఇంకా భయపడే స్థాయిలోనే ధరలు ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,240గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,640 వద్ద కొనసాగుతోంది. ప్రధాన నగరాల్లోనూ ఇదే స్థాయిలో ధరలు నమోదయ్యాయి.
Dec 30 Gold Prices | కాస్త ఊరట..
- హైదరాబాద్, ముంబై, బెంగళూరులో Bangalore 24 క్యారెట్ల బంగారం రూ.1,39,240గా, 22 క్యారెట్లు రూ.1,27,640గా ఉన్నాయి.
- ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,39,390గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,27,790గా కొనసాగుతోంది.
- చెన్నైలో మాత్రం బంగారం ధర మరింత ఎక్కువగా ఉండి, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,030గా, 22 క్యారెట్ల ధర రూ.1,30,040గా ఉంది.
మరోవైపు వెండి ధరలు తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర రూ.2,58,900 వరకు చేరి రికార్డు స్థాయిలో ట్రేడవుతోంది. గత వారం కేవలం నాలుగు ట్రేడింగ్ రోజుల్లోనే వెండి ధర కిలోకు రూ.32,000కు పైగా పెరగడం గమనార్హం.
సోమవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే వెండి ధర, మునుపటి ముగింపు ధర రూ.2,39,787తో పోలిస్తే రూ.14,387 పెరిగి రూ.2,54,174 కొత్త గరిష్ట స్థాయికి చేరింది. ప్రస్తుతం బంగారంతో పాటు వెండి కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతూ పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ధరల పెరుగుదలపై ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, టెస్లా సంస్థ యజమాని ఎలాన్ మస్క్ Elon Musk కూడా ఆందోళన వ్యక్తం చేయడం ఈ విలువైన లోహంపై ఉన్న డిమాండ్ ఎంత పెరిగిందో చెప్పే ఉదాహరణగా మారింది.