అక్షరటుడే, హైదరాబాద్: Dec 29 Gold Prices | గత వారం రోజులుగా బంగారం, వెండి ధరల్లో Silver Prices భారీ ర్యాలీ కొనసాగుతూ సరికొత్త ఆల్‌టైమ్ రికార్డులు నమోదయ్యాయి. ఈ వారం కూడా అదే జోరు కొనసాగి పసిడి ధర రూ.1.50 లక్షల మార్కును దాటే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మంగళవారం జరగనున్న అమెరికా ఫెడ్ రేట్ సమావేశం ఫలితాలపై ఆధారపడి బంగారం, వెండి ధరల దిశ నిర్ణయమవుతుందని చెబుతున్నారు. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, సోమవారం (డిసెంబర్ 28) ఉదయం 6.30 గంటల సమయంలో దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,210గా, 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,440గా ఉండగా, కిలో వెండి ధర రూ.2,50,900 వద్ద నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో గత వారం బంగారం ధర 3.77 శాతం పెరిగి ఔన్స్‌కు 4,584 డాలర్లతో ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకింది.
Dec 29 Gold Prices | భగ్గుమంటున్న బంగారం..
ఇదే సమయంలో వెండి ధరలు 14.4 శాతం ఎగసి 79.70 డాలర్ల వద్ద రికార్డు స్థాయికి చేరాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, డాలర్ బలహీనత కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడులైన బంగారం, వెండివైపు మొగ్గు చూపుతుండగా, పారిశ్రామిక వినియోగం కూడా ఉండటంతో వెండి బంగారాన్ని మించిన లాభాలు ఇస్తోంది. నగరాల వారీగా చూస్తే 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ.1,41,810, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, కేరళ, పుణెలో Pune రూ.1,41,210, న్యూఢిల్లీలో రూ.1,41,360గా ఉంది.
అలాగే 22 క్యారెట్ బంగారం ధర చెన్నైలో రూ.1,29,990, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, కేరళ, పుణెలో రూ.1,29,440, న్యూఢిల్లీలో రూ.1,29,590గా నమోదైంది. కిలో వెండి ధర చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళలో రూ.2,73,900గా ఉండగా, ముంబై, న్యూఢిల్లీ New Delhi , కోల్‌కతా, బెంగళూరు, పుణె, వడోదరా, అహ్మదాబాద్‌లో రూ.2,50,900గా కొనసాగుతోంది. బంగారం, వెండి ధరలు ఇలా పెరుగుతూ పోతుంటే సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పట్లో బంగారం కొనడం కలే అని కొందరు చెప్పుకొస్తున్నారు.