అక్షరటుడే, హైదరాబాద్: Dec 27 Gold Prices | దేశీయ మార్కెట్లో పసిడి ధరలు Gold Rates రోజురోజుకీ కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తూ సామాన్య వినియోగదారుడిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ధరల ర్యాలీతో బంగారం సగటు రేటు దాదాపు రూ.5,800 మేర పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ సమాచారం ప్రకారం శనివారం ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,030గా ఉండగా, 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,28,360కు చేరింది. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,40,100గా ఉంది. వచ్చే ఏడాదిలోనూ బంగారం, వెండి ధరల పెరుగుదల కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Dec 27 Gold Prices | ఇప్పట్లో తగ్గేలా లేవుగా..
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) 24 క్యారెట్ బంగారం ధర 4,500 డాలర్లకు, ఔన్స్ వెండి ధర 75 డాలర్లకు చేరువవుతుండటం భారత మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది మొత్తంగా బంగారం ధరలు సుమారు 70 శాతం వరకు పెరగ్గా, వెండి ధరలు ఏకంగా 140 శాతం మేర పెరిగినట్లు మార్కెట్ గణాంకాలు చెబుతున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, లోహాల సరఫరాలో అంతరాయాలు, అలాగే అమెరికా కేంద్ర బ్యాంక్ అయిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మరోసారి ప్రామాణిక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చన్న అంచనాలు పెట్టుబడిదారులను బంగారం, వెండి Silver వైపు మళ్లిస్తున్నాయని నిపుణులు వివరిస్తున్నారు.
ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే..
- చెన్నైలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ.1,40,630గా – 22 క్యారెట్ రూ.1,28,910గా – 18 క్యారెట్ రూ.1,07,610గా ఉంది.
- ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, కేరళ, పుణెలలో Pune 24 క్యారెట్ బంగారం రూ.1,40,030గా – 22 క్యారెట్ రూ.1,28,360గా – 18 క్యారెట్ రూ.1,05,030గా నమోదైంది.
- న్యూఢిల్లీలో 24 క్యారెట్ రూ.1,40,180గా – 22 క్యారెట్ రూ.1,28,510గా – 18 క్యారెట్ రూ.1,05,180గా ఉంది.
- వడోదరా, అహ్మదాబాద్‌లలో 24 క్యారెట్ రూ.1,40,080గా – 22 క్యారెట్ రూ.1,28,410గా – 18 క్యారెట్ రూ.1,05,080గా నమోదైంది.
వెండి ధరల విషయానికొస్తే చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళలో కిలో వెండి రూ.2,54,100గా ఉండగా, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పుణె, వడోదరా, అహ్మదాబాద్‌లలో రూ.2,40,100గా ఉంది