అక్షరటుడే, న్యూఢిల్లీ: Dec 26 Pre-market analysis | ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు మన మార్కెట్‌నుంచి పెట్టుబడులు ఉపసంహరిస్తూనే ఉన్నారు. రూపాయి విలువ బలహీనపడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లలో వీక్నెస్ కొనసాగుతోంది.
ప్రధాన ఆసియా మార్కెట్లు(Asian markets) లాభాల బాటలో సాగుతున్నాయి. గత సెషన్లో వాల్‌స్ట్రీట్ సైతం లాభాలతో ముగిసింది. గిఫ్ట్‌నిఫ్టీ(Gift nifty) మాత్రం నష్టాలతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు మరోసారి బలహీనంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Dec 26 Pre-market analysis | యూఎస్ మార్కెట్లు..
ఎస్అండ్పీ 0.41 శాతం, గత సెషన్లో నాస్డాక్(Nasdaq) 0.22 శాతం లాభంతో ముగిశాయి. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.09 శాతం లాభంతో ఉంది.
Dec 26 Pre-market analysis | యూరోప్ మార్కెట్లు..
క్రిస్మస్ సందర్భంగా యూరోపియన్ మార్కెట్లకు సెలవులు కావడంతో బుధవారం నుంచి ట్రేడింగ్ జరగడం లేదు.
Dec 26 Pre-market analysis | ఆసియా మార్కెట్లు..
ఉదయం 8 గంటల సమయంలో ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei) 1.02 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.78 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.57 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.27 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(HangSeng) 0.17 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.04 శాతం లాభంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ మాత్రం 0.26 శాతం నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ డౌన్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐ(FII)లు వరుసగా మూడో సెషన్లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 1,721 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. డీఐఐలు వరుసగా 83వ రోజు నికర కొనుగోలుదారులుగా ఉండి రూ. 2,381 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.14 నుంచి 0.98 కు తగ్గింది. విక్స్(VIX) మరో రికార్డ్ స్థాయి కనిష్టానికి పడిపోయింది. గత సెషన్లో 2 శాతం తగ్గి 9.19 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు బలహీనపడి 89.77 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.15 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 97.93 వద్ద కొనసాగుతున్నాయి.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్(Crude oil) ధర బ్యారెల్‌కు 62.39 డాలర్లకు చేరింది.
ఆర్బీఐ చేపట్టిన లిక్విడిటీ చొరవతో కరెన్సీలో స్థిరత్వం వస్తుందని భావిస్తున్నారు. - యూఎస్ జీడీపీ డాటా అంచనాలకన్నా పాజిటివ్‌గా వచ్చింది.
రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా మరో ప్రయత్నం చేస్తోంది. ఇది ఫలిస్తే క్రూడ్ ఆయిల్ ధరలు అదుపులో ఉండే అవకాశాలున్నాయి.