అక్షరటుడే, న్యూఢిల్లీ: Dec 24 Pre-market analysis | వాల్‌స్ట్రీట్(Wallstreet)లో లాభాలు కొనసాగుతున్నాయి. దాని ప్రభావం ప్రధాన ఆసియా మార్కెట్లపైనా కనిపిస్తోంది. గిఫ్ట్‌నిఫ్టీ లాభాలతో సాగుతుండడంతో మన మార్కెట్లు పాజిటివ్‌గా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Dec 24 Pre-market analysis | యూఎస్ మార్కెట్లు US Markets..
ఎస్అండ్పీ(S&P) ఆల్‌టైం హైకి చేరింది. ఇండెక్స్‌లోని చాలా స్టాక్స్ క్షీణించినా.. టెక్ స్టాక్స్‌లో జోరుతో రికార్డు స్థాయి గరిష్టాలను తాకింది. గత సెషన్లో నాస్డాక్(Nasdaq) 0.57 శాతం, ఎస్అండ్పీ 0.46 శాతం లాభంతో ముగిశాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.07 శాతం లాభంతో ఉంది.
Dec 24 Pre-market analysis | యూరోప్ మార్కెట్లు European Markets..
డీఏఎక్స్(DAX) 0.53 శాతం, ఎఫ్టీఎస్ఈ 0.24 శాతం లాభపడగా.. సీఏసీ 0.20 శాతం నష్టపోయింది.
Dec 24 Pre-market analysis | ఆసియా మార్కెట్లు Asian Markets..
ఉదయం 8 గంటల సమయంలో ప్రధాన ఆసియా మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(HangSeng) 0.22 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.12 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.18 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.07 శాతం లాభంతో ఉన్నాయి. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.08 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.13 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) 0.11 శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా రెండో సెషన్లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 1,794 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
డీఐఐ(DII)లు వరుసగా 82వ రోజు నికర కొనుగోలుదారులుగా ఉండి రూ. 3,812 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు. - నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.42 నుంచి 1.14కు తగ్గింది. విక్స్(VIX) రికార్డ్ స్థాయి కనిష్టానికి పడిపోయింది. గత సెషన్లో 3.07 శాతం తగ్గి 9.38 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ ఒక పైస బలపడి 89.65 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.16 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 97.76 వద్ద కొనసాగుతున్నాయి.
- జియో పొలిటికల్ టెన్షన్స్(Geo political tensions)తో క్రూడ్ ఆయిల్ ధర వరుసగా ఆరో సెషన్లోనూ పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 62.41 డాలర్లకు చేరింది.
- అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు పెరిగింది. రెండో త్రైమాసికంలో 3.8 శాతం వృద్ధి నమోదు కాగా.. మూడో త్రైమాసికంలో ఇది 4.3 శాతంగా ఉంది.
సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్పైరీ(Weekly expiry) నేపథ్యంలో మార్కెట్లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.