అక్షరటుడే, హైదరాబాద్: Dec 24 Gold Prices | మామూలుగానే అందరూ పసిడి ప్రియులే.. ఆడా మగా అనే తేడా లేకుండా బంగారం ధరించేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. భారతదేశంలో బంగారాన్ని శుభప్రదంగా భావించడమే కాకుండా, భద్రమైన పెట్టుబడి వనరుగా కూడా ఉపయోగిస్తుంటారు. అయితే ఈ ఆకర్షణే ఇప్పుడు సామాన్యులకు భారంగా మారుతోంది.
2025 సంవత్సరం ప్రారంభం నుంచి బంగారం, వెండి ధరలు Silver Prices ఎడతెరపి లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. ఒకరోజు పది నుంచి ఇరవై రూపాయలు తగ్గినట్టు కనిపించినా, వెంటనే వెయ్యి నుంచి రెండు మూడు వేల వరకు ఒక్కసారిగా పెరిగిపోతుండటంతో కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుత ధరలు చూస్తుంటే ఇకపై బంగారం మ్యూజియంలో చూసే వస్తువుగా మాత్రమే మిగిలిపోతుందేమో అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది.
Dec 24 Gold Prices | తగ్గేదే లే..
దేశవ్యాప్తంగా ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,38,560కు చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,27,010గా నమోదైంది. బంగారంతో పాటు వెండి కూడా అదే బాటలో పయనిస్తూ, గ్రాము వెండి ధర రూ.234.10గా ఉండగా, కిలో వెండి ధర రూ.2,34,100ల గరిష్ఠానికి చేరింది. ప్రధాన నగరాల వారీగా చూస్తే చెన్నైలో..
- Chennai 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,39,320గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,16,290గా ఉంది. అక్కడ కిలో వెండి ధర రూ.2,34,100గా నమోదైంది.
- ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.1,38,560, 22 క్యారెట్లకు రూ.1,27,010గా ఉండగా, వెండి కిలో ధర రూ.2,23,100గా ఉంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,38,710, 22 క్యారెట్ల ధర రూ.1,27,160గా ఉండగా, వెండి కిలో ధర రూ.2,23,100గా ఉంది.
- హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,38,560గా, 22 క్యారెట్ల ధర రూ.1,27,010గా ఉండగా, వెండి కిలో ధర రూ.2,34,100గా కొనసాగుతోంది.
మార్కెట్లో ప్రతి క్షణం ధరలు మారే అవకాశముంది. నిన్నటి ముగింపు ధరలతో పోలిస్తే నేటి ప్రారంభంలో తగ్గుదల లేదా పెరుగుదల ఉండవచ్చు. అంతేకాదు, స్థానిక డిమాండ్, సరఫరా, రాష్ట్ర పన్నులు తదితర కారణాల వల్ల అన్ని నగరాల్లో ఒకే రకమైన ధరలు ఉండవు. అందువల్ల బంగారం Gold, వెండి కొనుగోలు చేయాలనుకునేవారు ప్రత్యక్షంగా తాజా ధరలను తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్డేట్స్ కోసం 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చని వ్యాపార వర్గాలు తెలియజేస్తున్నాయి.