అక్షరటుడే, హైదరాబాద్: Dec 23 Gold Rates | పండుగల సీజన్ ప్రారంభమవడంతో బంగారం ధరలు మరోసారి పరుగులు పెడుతున్నాయి. రెండు రోజుల పాటు స్థిరంగా కొనసాగిన గోల్డ్ రేట్లు సోమవారం నుంచి మళ్లీ పెరుగుదల బాట పట్టగా, మంగళవారం ధరలు మరింత ఎగబాకి కొనుగోలుదారులకు బిగ్ షాక్ ఇచ్చాయి. దేశీయంగా పండుగల Festivals కారణంగా బంగారానికి డిమాండ్ భారీగా పెరగడం, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు బలపడటం వల్ల భారత్‌లోనూ గోల్డ్ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి.
Dec 23 Gold Rates | పెరుగుతున్న ధరలు..
ఈ నేపథ్యంలో ఇవాళ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
- హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.1,36,160గా నమోదైంది, ఇది నిన్నటితో పోలిస్తే రూ.10 పెరగడం గమనార్హం కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,810 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలోనూ 24 క్యారెట్ల గోల్డ్ రూ.1,36,160గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,24,810గా ఉంది.
- విశాఖపట్నంలో కూడా ఇదే రేట్లు కొనసాగుతున్నాయి.
- చెన్నైలో Chennai మాత్రం బంగారం ధరలు స్వల్పంగా ఎక్కువగా ఉండగా, అక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.1,37,140గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,25,710గా నమోదైంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం రూ.1,36,160గా, 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,24,810గా కొనసాగుతోంది.
- దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,310 వద్ద ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,24,960గా ఉంది.
ఇక వెండి ధరల Silver Prices విషయానికి వస్తే, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,31,100గా నమోదై నిన్నటితో పోలిస్తే రూ.100 మేర పెరిగింది. విజయవాడ, విశాఖపట్నం, చెన్నై నగరాల్లో కూడా కిలో వెండి ధర రూ.2,31,100గానే కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.2,19,100గా ఉండగా, ఢిల్లీలో కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. మొత్తంగా పండుగల డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో గోల్డ్, సిల్వర్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.