Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | అప్పులు ఎక్కువయ్యాయి.. ఎలా చనిపోవాలో తెలియడం లేదు.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కాంట్రాక్టు...

Kamareddy | అప్పులు ఎక్కువయ్యాయి.. ఎలా చనిపోవాలో తెలియడం లేదు.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కాంట్రాక్టు లెక్చరర్

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కాంట్రాక్ట్​ అధ్యాపకుడు అదృశ్యమయ్యాడు. ఎలా చనిపోవాలో తెలియడం లేదని లెటర్​ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ‘అప్పులు ఎక్కువయ్యాయి. తీర్చే మార్గం లేదు.. ఎలా చనిపోవాలో తెలియడం లేదు.. నష్టజాతకున్ని’ అంటూ ఇంట్లో లేఖ రాసి పెట్టి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (government degree college) కాంట్రాక్టు లెక్చరర్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో (Kamareddy town) ఈ నెల 3 న చోటు చేసుకుంది.

పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో ఉండే బోడ చంద్రశేఖర్ మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్​గా (contract lecturer) పని చేస్తున్నాడు. చంద్రశేఖర్​కు గతంలో రెండు పెళ్లిళ్లయి విడాకులయ్యాయి. తల్లి కళావతితో కలిసి ఉంటున్నాడు. అయితే ఈ నెల 3న ఉదయం కూరగాయల మార్కెట్​కు వెళ్లి వస్తానని వెళ్లిన చంద్రశేఖర్ సాయంత్రం అయినా తిరిగి రాలేదు.

తల్లి ఫోన్ చేయగా రెండు నంబర్లు స్విచ్చాఫ్ వచ్చాయి. మూడు రోజుల పాటు చంద్రశేఖర్ కోసం తల్లి తన తమ్ముడితో కలిసి అంతటా వెతికింది. అయినా ఆచూకీ లభించలేదు. మూడు రోజుల తర్వాత ఇంట్లో టివీ వెనకాల బుక్కులో ఓ లేఖ కనిపించింది. అందులో ‘అప్పులు బాగా అయ్యాయి. ఎలా చనిపోవడం తెలియడం లేదు. నష్ట జాతకున్ని’ అంటూ లేఖలో ఉంది. దాంతో తల్లి కళావతి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.