HomeUncategorizedPlane Crash | అమిత్​ షా కీలక ప్రకటన.. ఆ తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టతన్న...

Plane Crash | అమిత్​ షా కీలక ప్రకటన.. ఆ తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టతన్న కేంద్ర మంత్రి

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Plane Crash : గుజరాత్​(Gujarat)లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 242 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. దేశంలోనే అత్యంత దురదృష్టకరమైన ఈ ఘటనలో మృతదేహాల వెలికితీత పూర్తయింది. అనంతరం కేంద్ర మంత్రి అమిత్​ షా(Union Minister Amit Shah) అహ్మదాబాద్ లో ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.

గుజరాత్​(Gujarat) విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికుడిని కలిసినట్లు కేంద్ర మంత్రి అమిత్​ షా తెలిపారు. కిందపడ్డ విమానం పేలిపోవడంతో ప్రయాణికులకు తప్పించుకునేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రయాణికుల మృతదేహాలను వెలికి తీసే పని పూర్తయినట్లు తెలిపారు.

డీఎన్‌ఏ పరీక్షల(DNA tests) తర్వాతే మృతుల సంఖ్యపై అధికారికంగా ప్రకటన చేస్తామన్నారు. ఇందుకు వెయ్యికి పైగా డీఎన్‌ఏ టెస్టులు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గుజరాత్‌లోనే వీలైనంత త్వరగా డీఎన్‌ఏ పరీక్షలు పూర్తి చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెల్లడించారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. మృతుల తరఫున కేంద్రం, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం ప్రకటించే అవకాశం ఉంది.