HomeUncategorizedFighter Jet Crash | విమానం కూలిన ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

Fighter Jet Crash | విమానం కూలిన ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fighter Jet Crash | బంగ్లాదేశ్ (Bangladesh)​లో ఫైటర్​ జెట్​ కూలిన ప్రమాదంలో (Fighter Jet Crash) మృతుల సంఖ్య పెరిగింది. శిక్షణ యుద్ధ విమానం బంగ్లాదేశ్​ రాజధాని ఢాకా(Dhaka)లోని కాలేజీ భవనంపై కూలిన విషయం తెలిసిందే. మొదట ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు భావించారు. అయితే తాజాగా మృతుల సంఖ్య 19కి చేరింది. 100 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

బంగ్లా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన F-7 BGI శిక్షణ విమానం సోమవారం మధ్యాహ్నం ఢాకాలోని మైల్స్‌స్టోన్‌ స్కూల్‌, కాలేజ్‌ (Milestone School, College) ప్రాంగణంలో కూలిపోయింది. ఆ సమయంలో పాఠశాలలో విద్యార్థులు ఉండడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. స్థానికులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఘటనా స్థలంలో 19 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. పలువురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై బంగ్లా తాత్కాలిక ప్రధాన మంత్రి ముహమ్మద్ యూనస్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘటనను దేశానికి తీవ్ర దుఃఖం కలిగించే క్షణం అని అభివర్ణించారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.